Mister Mummy Movie: నా కాన‍్సెప్ట్‌ను మక్కీకి మక్కీ కాపీ కొట్టారు.. మిస్టర్‌ మమ్మీపై దర్శకుడు ఆరోపణలు

1 Nov, 2022 16:03 IST|Sakshi

జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మమ్మీ'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. షాద్ అలీ దర్శకత్వం వహించిన  ఈ మూవీ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ మంజ్రేకర్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టర్ మమ్మీ ట్రైలర్‌లో రితేశ్ గర్భంతో కనిపిస్తుండగా.. మహేష్ మంజ్రేకర్ డాక్టర్ పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ సినిమాపై మరో దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. 

(చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!)

కోల్‌కతాకు చెందిన చిత్రనిర్మాత, దర్శకుడు ఆకాశ్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తన స్క్రిప్ట్‌ను కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు.   'మిస్టర్ మమ్మీ' చిత్రంలోని కాన్సెప్ట్‌ను తన స్టోరీ అయిన 'విక్కీ పేట్ సే' నుంచి కాపీ చేశారంటూ వ్యాఖ్యానించారు.

ఆకాశ్ ఛటర్జీ మాట్లాడుతూ.. 2020లో నేను 'విక్కీ పేట్ సే' కథతో టీ-సిరీస్‌ను సంప్రదించా. అప్పుడు ఈ చిత్ర నిర్మాణానికి కూడా అంగీకరించారు. కానీ  ఆ తర‍్వాత అసలు కథకు ఎలాంటి మార్పులు లేకుండా 'మిస్టర్ మమ్మీ' పేరుతో మూవీని రూపొందించారు.' అని అన్నారు. అందుకే తన కథకు క్రెడిట్ ఇవ్వాలని ఆకాశ్ ఛటర్జీ డిమాండ్ చేస్తున్నారు. తన స్క్రిప్ట్‌ను స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేశానని ఆకాశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.  టి-సిరీస్‌తో అతని సంభాషణకు సంబంధిచిన  స్క్రీన్‌ షాట్‌లను పంచుకున్నారు. ఆ చిత్రంలో టైటిల్ రోల్‌లో ఆయుష్మాన్ ఖురానా కనిపించారు.

మరిన్ని వార్తలు