క్యాన్సర్‌తో చనిపోయిన ప్రముఖ హీరోయిన్.. ప్రముఖుల నివాళి

28 Jan, 2024 08:29 IST|Sakshi

దిగ్గజ హీరోయిన్ తుదిశ్వాస విడిచింది. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈమె.. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ వచ్చింది. మొన్నీమధ్య హాస్పిటల్‌ నుంచి ఇంటికొచ్చిన ఈమె ఉన్నట్లుంది కన్నుమూసింది. ఎవరీ నటి? ఏ సినిమాల్లో నటించింది? అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్)

బెంగాలీ నటి శ్రీల మజుందార్ గురించి ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1980ల్లో 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అకాలేర్ సందానే, ఏక్ దిన్ ప్రతిదిన్, కరీజ్ లాంటి సినిమాలు ఈమె కెరీర్‌లో మైలురాళ్ల లాంటి చిత్రాలని చెప్పొచ్చు. దిగ్గజ డైరక్టర్ మృణాల్ సేన్-శ్రీల కాంబోలో వచ్చిన కొన్ని చిత్రాలైతే బెంగాలీ ఇండస్ట్రీలో ఐకానిక్‌గానూ నిలిచిపోయాయి. 

గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీల.. నెల రోజుల క్రితమే అనారోగ్యానికి గురైంది. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో ఉంచడంతో కాస్త కోలుకుంది. ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా హెల్త్ పాడైంది. అలా ఇంట్లో ఉండగానే శ్రీల.. తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఈ నటి భర్త, జర్నలిస్టు ఎస్ఎన్ఎమ్ అబ్ది వెల్లడించారు. ఈమె మృతిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ సానుభూతి తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన)

whatsapp channel

మరిన్ని వార్తలు