అందమైన మోసం 

22 Sep, 2023 01:57 IST|Sakshi
సూర్య తేజ

పబ్లిసిటీ డిజైనర్‌ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్‌ ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఫ్రాడ్‌ ఇన్‌ ది వరల్డ్‌’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్‌.

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్‌ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించారు.పోస్ట్‌  ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: వెంకట్‌ ఆర్‌. శాఖమూరి.  
 

మరిన్ని వార్తలు