ఆయనతో ఒక్క ఫోటో కూడా లేదు : నటి భావోద్వేగం

14 Jul, 2021 14:18 IST|Sakshi

తండ్రిని తలుచుకుని హాస్యనటి కన్నీరు

భర్త ద్వారానే ప్రేమ విలువ తెలిసింది: భారతీ సింగ్‌

సాక్షి,ముంబై: తెరపై హాస్యాన్ని పండిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చాలామంది నటుల జీవితాల్లో ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంటుంది. ప్రముఖ కమెడియన్‌ భారతీ సింగ్ తన జీవితంలో అలాంటి మరో కోణాన్ని, విషాదాన్ని ఇటీవల ఒక షోలో షేర్‌ చేసుకున్నారు. తనకు జీవితంలో మిగిలింది తల్లి ఒక్కతేనని, తండ్రి ప్రేమ దక్కలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న వైనం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మనీష్ పాల్ ఈ వీడియో లింక్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఆయన ముఖాన్ని కూడా చూడలేదని భారతీ సింగ్‌ చెప్పు కొచ్చారు. అంతేకాదు ఆయనతో తనకు ఒక్క ఫోటో కూడా లేకుండా పోయిందని వాపోయారు. తన అక్కకు, అన్నకు దక్కిన అదృష్టాన్ని కోల్పోయానన్నారు. అలాగే తమ కుటుంబంలో అందరూ వారి వారి జీవితాల్లో బిజీగా ఉండటం తగిన పప్రేమను పొందలేకపోయానని వ్యాఖ్యానిచారు.  అయితే భర్త హర్ష్ లింబాచియాతో ఆ లోటు తనకు తీరిందన్నారు.  భర్త ద్వారా తరువాత మాత్రమే ప్రేమ గురించి  తెలిసిందని, పురుషుని ప్రేమ తనకు అర్థమైందని పేర్కొన్నారు. కాగా భారతీ సింగ్ తన చిరకాల ప్రేమికుడు  హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017 న గోవాలో వివాహం చేసుకున్నారు.

మనీష్ పాల్ ఇన్‌స్టాలో పోడ్‌కాస్ట్ లింక్‌ను షేర్‌ చేస్తూ హాస్య దిగ్గజం చార్లీ చాప్లిన్ మాటలు “నేను ఎప్పుడూ వర్షాలలో నడవడం ఇష్టపడతాను. ఎందుకంటే నా ఏడుపు ఎవరూ చూడలేరు’’ కోట్‌ చేశారు. మనల్ని నవ్వించే వ్యక్తులు చాలా గుంభనంగా ఉంటారు. తమ గాయాలను దాచుకుంటారు. అలాంటి వారిలో నవ్వుల రాణి భారతి  ఒకరు  అనీ,  ఆమె తన అనుభవాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

A post shared by Maniesh Paul (@manieshpaul)

మరిన్ని వార్తలు