ప్రతి ఒక్కరిని గ్రామాలకు తీసుకెళ్లే చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’

24 Jul, 2022 11:25 IST|Sakshi

 ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. పద్మ, ప్రసన్న, మానుకోట ప్రసాద్‌, గడ్డం నవీన్‌, మల్లికార్జున్‌, మహి, వల్లి సత్య ప్రకాష్‌, సుధాకర్ రెడ్డి,కీర్తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు గంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది అని దర్శకుడు రమేష్‌ చెప్పాల అన్నారు.

కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ , ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. రెండు గంటల పాటు పల్లె వాతావరణం కల్లముందు కదలాడేలా చేస్తూ.. ప్రతి ఒక్కరిని గ్రామానికి తీసుకెళ్లే చిత్రమిది అన్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏబీ సినిమాస్‌ అండ్‌ నిహాల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు