Mounika Reddy: గతేడాది డిసెంబరులో పెళ్లి.. ఇప్పుడేమో ఇలా!

1 Oct, 2023 16:19 IST|Sakshi

ఒకప్పుడు ఏమో ఇప్పుడు పెళ్లి-విడాకుల వ్యవహారం మరీ సాధారణమైపోయింది. సామాన్యుల సంగత కాస్త పక్కనబెడితే నటీనటులు చాలామంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. చప్పుడు చేయకుండా విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మెగాడాటర్ నిహారిక విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు మరో తెలుగు నటి కూడా విడాకులు తీసుకోనుందా అనే సందేహాం వస్తోంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: ఊహించని సర్‌ప్రైజ్‌.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!)

షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. 'సూర్య' వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయింది. 'భీమ్లా నాయక్'తోపాటు పలు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది. అలానే కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో ఈమె రిలేషన్‌లో ఉంది. అలా మనసులు కలిసిన తర్వాత గతేడాది డిసెంబరులో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

అయితే తన పెళ్లి టైంలో మౌనిక చాలా ఎగ్జైట్ అవుతున్న వీడియో అప్పట్లో చాలా పాపులర్ అయింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో తాజాగా ఈమె.. పెళ్లి ఫొటోలు అన్నింటినీ ఇన్ స్టాలో డిలీట్ చేసింది. అలానే భర్త సందీప్ ని కూడా అన్ ఫాలో చేసింది. దీంతో వీళ్లిద్దరి బంధం బ్రేక్ అయిందా అనే రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి దీని గురించి ఎలా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7 షోలోకి ప్రభాస్ హీరోయిన్‌!)

A post shared by Mounika Reddy (@monie_kaaa)

మరిన్ని వార్తలు