Pawan Singh : నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ సింగ్‌కు చేదు అనుభవం.. లైవ్‌ షోలో రాళ్లదాడి

9 Mar, 2023 12:32 IST|Sakshi

ప్రముఖ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్‌ షోలోనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. భోజ్ పురి ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్‌ సింగ్‌ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ అలరిస్తున్నారు. తాజాగా ఈయన హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా జనాల్లో నుంచి ఒకరు రాయి విసిరారు. అది నేరుగా పవన్‌ సింగ్‌ ముఖానికి తగిలింది. ఆ పని ఎవరు చేశారు అని చూసేలోపే గుంపులోంచి మరికొంతమంది పవన్‌పై రాళ్ల దాడి చేశారు.

ఈ ఘటనపై సీరియస్‌ అయిన పవన్‌ సింగ్‌.. గుంపులో ఉండి రాళ్లు విసరడం కాదు.. దమ్ముంటే నా ముందుకు వచ్చి నాపై రాళ్లు విసరండి అంటూ సవాల్‌ విసిరారు. ఊహించని ఈ పరిణామం నేపథ్యంలో ఈవెంట్‌ మేనేజర్లు వెంటనే ఈవెంట్‌ను ఆపేశారు. పవన్‌ సింగ్‌ ముఖానికి స్వల్పగాయమైనట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు