నాకు లక్ష ఇస్తే.. తనకు రూ. 25 వేలే

15 Sep, 2020 08:37 IST|Sakshi

బాలీవుడ్‌ టీవీ షో కపిల్‌ శర్మ కార్యక్రమానికి ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడా స్టార్స్‌ అంతా ఈ షోకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఈ వారం కపిల్‌ శర్మ షోకు భోజ్‌పురి సూపర్‌ స్టార్లు మనోజ్‌ తివారీ, రవి కిషన్‌ వచ్చారు. తమ జీవితాలు, కెరీర్‌కు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాక ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రవి కిషన్‌ నాకు సీనియర్‌. నేను పరిశ్రమలోకి వచ్చేనాటికే అతడు సూపర్‌ స్టార్‌. అయితే ఒక సినిమాకు రవికిషన్‌కు కేవలం 25 వేల రూపాయలు ఇస్తే.. నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. అది కూడా కేవలం ఒక ఐటమ్‌ సాంగ్‌ కోసం’ అంటూ రవి కిషన్‌ని ఆట పట్టించాడు. ఈ షోలో క్రికెట్‌ ఆడారు. ఇలా ఇద్దరు ఒకే షోకు హాజరుకావడం చాలా గొప్ప విషయం అన్నారు. అంతేకాక ఇండస్ట్రీలో వారి ప్రయాణం.. ఎదుర్కొన్న కష్టాలు.. హార్డ్‌ వర్క్‌ వంటి విషయాల గురించి వెల్లడించారు. (చదవండి: ‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’)

అభిమానులతో మాటల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇద్దరు హీరోలు. తాను రాజకీయ నాయకుడిని అయితే.. నదులను శుభ్రం చేస్తానని తెలిపారు మనోజ్‌ తివారీ. ఇద్దరికి సంబంధించిన ఫోటోలను షోలో ప్రదర్శించారు. వాటిల్లో వారు సమజానికి సేవ చేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో మనోజ్‌ తివారీ పేదలకు సాయం చేయగా.. రవి కిషన్‌ తన స్వస్థలం.. గోరఖ్‌పూర్‌లో వరదల సమయంలో, లాక్‌డౌన్‌ కాలంలో జనాలకు అవసరమైన వస్తువులను అందించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

कल

A post shared by Ravi Kishan (@ravikishann) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు