వాస్తవ ఘటనలతో... 

22 Sep, 2023 02:14 IST|Sakshi
నికిత, టీవీ రవి 

నికిత శ్రీ, పృథ్వీరాజ్‌ (పెళ్లి), థర్టీ ఇయర్స్‌ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్‌ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు.

నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్‌ చక్రవర్తి.

మరిన్ని వార్తలు