Bhuj: The Pride Of India: భుజ్‌ ట్రైలర్‌ చూశారా?

12 Jul, 2021 12:03 IST|Sakshi

Bhuj: The Pride Of India Trailer: 1971లో జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’. అజయ్‌ దేవగణ్‌, సంజయ్‌ దత్, సోనాక్షీ సిన్హా, షరద్‌ కేల్కర్, ప్రణీతా సుభాష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్‌ దుధయ్యా దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. 'మరాఠాలకు చావడం లేదా చంపడం.. ఈ రెండే తెలుసు', 'చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటాం', 'నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను' వంటి డైలాగులు ట్రైలర్‌లో తూటాల్లా పేలాయి. చంటిపాపను ఎత్తుకున్న సోనాక్షి ఒంటిచేత్తో చిరుతపులిని హతమార్చడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది.

కాగా యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భుజ్‌ అనే ఎయిర్‌పోర్ట్‌ ధ్వంసమవగా అప్పటి ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ విజయ్‌ కార్నిక్‌ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్‌ బెన్‌ పాత్రలో సోనాక్షి సిన్హా నటించింది. ఈ సినిమా ఆగస్టు 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో భుజ్‌ విడుదల కానుంది. ట్రైలర్‌ ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు