నమ్మకాన్ని నెరవేరుస్తా..!

16 Jan, 2021 09:28 IST|Sakshi

‘‘గతంలో జయా బచ్చన్, షబానా ఆజ్మీ, శ్రీ దేవి, హేమ మాలినీ, రేఖ వంటివారు భిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. గ్లామరస్‌ పాత్రలు చేసే నటీమణులకే ఆదరణ ఉంటుందని కాకుండా భిన్నమైన పాత్రలు పోషించేవారిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి వీళ్లంతా ఓ ఉదాహరణ’’ అంటున్నారు బాలీవుడ్‌ నటి భూమీ పెడ్నేకర్‌. ఇంకా ఆమె మాట్లాడుతూ –  ‘‘సీనియర్‌ తారల్లా అన్ని రకాల పాత్రలు చేసి, సినిమాకు న్యాయం చేయాలనేదే నా కోరిక. 90వ దశకంలోనే రంగీలా, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌ కుచ్‌ హోతా హై వంటి సినిమాల్లో కథానాయికల పాత్రలు పలు వేరియేషన్‌లను చూపించాయి’’ అన్నారు. (చదవండి: నేనేమీ మారలేదు.. అలాగే ఉన్నా..)

అలానే ‘‘కరీనా కపూర్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆమె చమేలీ, ఫెవికాల్‌ వంటి భిన్న సినిమాల్లో వేర్వేరు పాత్రల్లో తన ప్రతిభ నిరూపించుకుంది. నేను కూడా భిన్నమైన పాత్రలనే చేయాలనుకుంటున్నాను. అలాంటివే ఎంపిక చేసుకుంటున్నాను. ప్రేక్షకులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేరవేర్చడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పారు. దమ్‌ లగాకే ఐసా, టాయ్‌లెట్‌–ఏక్‌ ప్రేమ్‌ కథ, శుభ్‌మంగల్‌ సావ్‌ధాన్, సోంచరియా, సాంద్‌ కీ ఆంఖ్, పతీ పత్నీ ఔర్‌ వో వంటి సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు భూమి. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు