మా చిన్నమ్మ ఐసీయూలో ఉంది.. వెంటిలేటర్‌ బెడ్‌ కావాలి :నటి

4 May, 2021 19:56 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్‌ బారిన పడుతున్నారు. కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా లక్షలు వెచ్చించినా పలు ప్రాంతాల్లో వెంటిలేటర్లు, బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్‌ నటి భూమి ఫడ్నేకర్‌కు సైతం ఇలాంటి పరిస్థతే ఎదురైంది. వెంటిలేటర్‌ కావాలని, ఎవరికైనా వివరాలు తెలిస్తే అందజేయాలని సోషల్‌ మీడియాలో విన్నవించుకుంది.

'ఇది చాలా కష్టతరమైన సమయం. డిల్లీలోని ఎన్‌సీఆర్‌ ఆసుపత్రిలో మా చిన్నమ్మ ఐసీయూ ఉంది. తక్షణమే ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలి. దయచేసి మీలో ఎవరికైనా వెంటిలేటర్‌ బెడ్‌ సమాచారం తెలిస్తే ఆ వివరాలు నాకు పంపండి' అని సోషల్‌ మీడియాలో ఓ పోస్టును షేర్‌ చేసింది. కాగా భూమి ఫడ్నేకర్‌ షేర్‌ చేసిన కొద్ది గంటల్లోనే ఆమెకు సహాయం అందడంతో ఆ పోస్టును డిలీట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఒక సెలబ్రిటీ అయ్యిండి భూమి ఫడ్నేకర్‌ లాంటి వాళ్లే వెంటిలేట్‌ దొరకడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలె భూమి ఫడ్నేకర్‌ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ సినిమాలో నటిస్తుంది. 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

చదవండి : దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్‌ పడుకోనే
యాంకర్‌ అనసూయ భర్త జాబ్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు