దాని వల్ల 8 రోజులు నరకం అనుభవించా: హీరోయిన్

22 Nov, 2023 13:34 IST|Sakshi

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇటీవలే ది లేడీ కిల్లర్  అనే క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానులను అలరించింది.  థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత అర్జున్ కపూర్ సరసన  నటించింది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్‌ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌ కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే భూమి ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.  డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం అంతా బాగుందని తెలిపింది.  ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాకుండా దోమల నివారణ తప్పనిసరి అని కోరింది.  అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి ఒక కారణమని భూమి ఫెడ్నేకర్ పేర్కొంది.

భూమి ఇన్‌స్టాలో రాస్తూ.. “ఒక దోమ వల్ల నేను  8 రోజులు నరకం అనుభవించా.  దాదాపు వారం రోజుల తర్వాత ఉదయాన్నే నిద్ర లేచా. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దోమలను చంపే వాటిని వినియోగించడం  తప్పనిసరి. అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. అధిక కాలుష్యంతో మన రోగనిరోధక శక్తిలో చాలా వరకు తగ్గుతోంది. నాకు తెలిసిన చాలా మందికి కూడా డెంగ్యూ వచ్చింది.  నన్ను బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు' అని పోస్ట్ చేసింది.

A post shared by Bhumi Pednekar (@bhumipednekar)

మరిన్ని వార్తలు