అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్‌..నెటిజన్స్‌ ఫైర్‌

4 Mar, 2023 10:03 IST|Sakshi

సినిమా నటులకు జనాల్లో ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏదైనా మంచి చేస్తే భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు.  అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే కూడా అదే స్థాయిలో ట్రోల్స్‌ చేస్తారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్‌కి వెళ్తే నడక నుంచి మాట వరకు ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ చిన్న తప్పు చేసినా నెటిజన్స్‌ ఆడేసుకుంటారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ భూమి ఫెడ్నేకర్‌ తన అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకొని వివాదంలో చిక్కుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. భూమి ఫెడ్నేకర్‌ తాజాగా ఓ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా స్టేజ్‌ ఎక్కారు. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్‌పై రావాలని పిలిచారు. దీంతో ఆమె చెప్పులు విప్పి అక్కడికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోయింది.

దీంతో పక్కకు వచ్చి అసిస్టెంట్‌కి సైగ చేయగా..అతను వచ్చి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్‌ పైకి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్‌ వైరల్‌ అవుతోంది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది భూమి ఫెడ్నేకర్‌. . మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్‌ వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు