విడాకుల రూమర్ల‌కు చెక్ పెట్టిన భూమిక‌

21 Oct, 2020 20:07 IST|Sakshi

'యువ‌కుడు' సినిమాతో తెలుగు తెర‌పై అడుగు పెట్టిన హీరోయిన భూమిక చావ్లా‌. ఖుషీ, వాసు, ఒక్క‌డు, సింహాద్రి వంటి సినిమాల‌తో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. త‌న పాత్ర‌ల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. కానీ ఆ పాపులారిటీని ఎక్కువ రోజులు నిల‌బెట్టుకోలేక‌పోయారు. వ‌ర‌స సినిమాలు చేశార‌న్న మాటే కానీ కెరీర్‌లో డ‌ల్ అయిపోయారు. 2007లో త‌న‌ యోగా టీచ‌ర్ భ‌ర‌త్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఒక బాబు పుట్టారు. అయితే సోష‌ల్ మీడియాలో భ‌ర్తతో క‌లిసి దిగిన‌ ఫొటోలు పెట్ట‌నందుకు, బ‌య‌ట ప‌బ్లిక్‌లో ఒంట‌రిగా క‌నిపించినంత మాత్రానికే ఆమె విడాకులు తీసుకుందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. (చ‌ద‌వండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్‌?)

తాజాగా ఈ వార్త‌ల‌కు భూమిక చెక్ ప‌ట్టారు. పెళ్లి రోజు సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "వెయ్యి మైళ్ల ప్ర‌యాణ‌మైనా ఒక్క అడుగుతోనే మొద‌లవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒక‌రి గురించి ఒక‌రం మ‌రింత లోతుగా అర్థం చేసుకోవ‌డమే. మన గురించి మ‌నం ఇంకా తెలుసుకోవ‌డ‌మే. మ‌న‌ల్ని, మ‌న జంట ప్ర‌యాణాన్ని ఆ దేవుడు ఆశీర్వ‌దించాలి. నిన్ను, నీ అంకిత‌భావాన్ని, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది" అని రాసుకొచ్చారు. ఈ పోస్టుతోనైనా ఆమె విడాకులు తీసుకుంటుంద‌నే రూమ‌ర్ల‌కు స్వ‌స్తి ప‌లకాల‌ని ఆశిద్దాం.. (చ‌ద‌వండి: అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక)

A journey of a thousand miles begins with a single step .... LOVE ....... and it’s love , learning , understanding , a journey of laughter and moments .... discovering more about each other And ourselves ... Thank you for Everything 🌺 ...... may God bless us and our journey together .. Proud of you and your hard work and your dedication to whatever you do in life 😊 .. 🌸💕💐 Happy Anniversary 💐🌻

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా