రోడ్డు ప్రయాణం

31 Oct, 2020 06:38 IST|Sakshi

‘‘చాలా రోజుల తర్వాత సినిమా సెట్స్‌పైకి వచ్చాను. త్వరలో మీ అందర్నీ తెరపై కలుసుకుంటాం’’ అని భూమిక అన్నారు. సుమంత్‌ అశ్వి¯Œ , శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది.  గురుపవన్‌ దర్శకత్వంలో జి. మహేష్‌ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత గురువారం పునఃప్రారంభమైన షూటింగ్‌లో భూమిక జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాలుగు పాత్రల చుట్టూ నడిచే రోడ్‌ జర్నీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్‌డౌన్‌కు ముందుగానే లడఖ్‌ షెడ్యూల్‌తో సహా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భూమిక, శ్రీకాంత్‌ లాంటి సీనియర్‌ యాక్టర్లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ‘‘ఏడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు రావడం హ్యాపీ’’ అన్నారు శ్రీకాంత్‌. ఈ చిత్రానికి కెమెరా: సి. రామ్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిరంజీవి ఎల్, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు