మూడు గంటల్లో ఇద్దరు చావాలి.. ఆస‌క్తినిరేకెత్తిస్తోన్న ‘భువన విజయమ్’ టీజర్‌

14 Mar, 2023 12:49 IST|Sakshi

కొన్ని సినిమాలు టైటిల్‌తోనే ఆసక్తిని పెంచేస్తాయి. అలాంటివాటిలో సునీల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్‌’ ఒకటి. శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు  ఆస్థానానికి ‘భువన విజయమ్’ అని పేరు. ఇప్పుడు అదే టైటిల్ తో సునీల్ సినిమా రావడం క్యురియాసిటీని పెంచింది. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతిని విడుదల చేశారు. టైటిల్ లానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

‘ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూసర్.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. అనుకోకుండా రైటర్ గా మారిన ఓ దొంగ.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ..  పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’అంటూ ఆసక్తిని రేపే వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ చేశారు. టీజర్ చాలా ఎంగేజింగ్ ఉంది. కామెడీ, సస్పెన్స్, థ్రిల్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి.  సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ తమదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు