మోనాల్‌పై అఖిల్‌కి ఎంత ప్రేమో.. ఈ పోస్ట్‌ చూస్తే తెలిసిపోతుంది

14 May, 2021 12:17 IST|Sakshi

‘మోనాల్‌-అఖిల్‌ మధ్య ఏదో ఉంది.. అది కచ్చితంగా ప్రేమే. లేకపోతే అంత క్లోజ్‌గా ఎలా ఉంటారు? అఖిల్‌ కోసం మోనాలు ఎన్ని త్యాగాలు చేసింది. అఖిల్‌ కూడా మోనాల్‌ని ఎవరైనా ఏమైనా అంటే అస్సల్‌ సహించడు. దీన్ని ప్రేమ కాకపోతే ఇంకేం అంటారు?  బయటకు వచ్చాక కచ్చితంగా వాళ్లు పెళ్లి చేసుకుంటారు’... బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ మొదలయ్యాక రెండో వారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదిలిన అనుమానాలు ఇవి.

ఈ అనుమానాలు నిజం చేస్తూ బయట కూడా ఈ జంట ఎప్పుడూ కలుస్తూ నెట్టింట హల్‌ చేస్తుంది. పైకి మంచి స్నేహితులు అని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.  అయితే అప్పుడప్పుడు మాత్రం వీరి ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్‌లతో వీరిమధ్య ప్రేమ ఉందనే సందేహాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా అఖిల్‌ మరో అడుగు ముందుకేసి తన రాణి మోనాలే అని చెప్పేశాడు. దీంతో వారి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని తెలిసిపోయింది.

మోనాల్‌ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్‌ ఆమెకు బర్త్‌డే విషెష్‌ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని,  అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు.

మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు.  మోనాల్‌ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్‌, మోనాల్‌ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు