బిగ్‌బాస్‌ భాను కొత్త చిత్రం మౌనం ట్రైలర్‌ రిలీజ్‌

27 Sep, 2021 08:10 IST|Sakshi

‘మల్లెపువ్వు’ ఫేమ్‌ మురళి, ‘బిగ్‌ బాస్‌‘ ఫేమ్‌ భానుశ్రీ జంటగా లాస్‌ ఏంజెల్స్‌ టాకీస్‌ పతాకంపై కిషన్‌ సాగర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మౌనం’. ఈ  చిత్రానికి ‘వాయిస్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. అల్లూరి సూర్యప్రసాద్‌–సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రమేష్‌ వర్మ ఆవిష్కరించి, ‘‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో నా మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్‌గా చూపించే పారా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మా ‘మౌనం‘. అక్టోబర్‌ మొదటి వారంలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు