కొంప ముంచిన బ్యూటీ టిప్‌.. కంటి చూపు కోల్పోయిన టిక్‌టాక్‌ స్టార్‌

12 May, 2021 16:34 IST|Sakshi

చాలా మంది అమ్మాయిలు అందంగా కపించడం కోసం మార్కెట్లో కనిపించే వివిధ ఫేస్‌ క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా యాడ్స్‌, సోషల్‌ మీడియాలో వచ్చే బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతుంటారు. నిపుణుల సలహాలను తీసుకోకుండా దొరికిన క్రీములన్నింటిని ముఖాలపై ప్రయోగిస్తుంటారు. దీని వల్ల ఉన్న అందంతో పాటు కంటి చూపు కూడా కోల్పేయే ప్రమాదం ఉంది. అందుకే ఫేస్‌ క్రీముల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ అమ్మాయి పరిస్థితే మీ అందరికి వచ్చే అవకాశం ఉంది. 

టిక్ టాక్ స్టార్, ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కంటెస్టెంట్ అయిన టిల్లీ విట్‌ ఫెల్డ్ అనే యువతి.. ఓ వీడియో చూసి అప్లై చేసుకున్న బ్యూటీ టిప్... ఆమెను ఆస్పత్రిపాలు చేసింది. బిగ్ బ్రదర్ షోలో ఆమె... తన ఫేసుకు బ్లూ క్లే ఫేస్ మాస్క్ ధరించింది. అలా ఎందుకు ధరించావని నెటిజన్లు అడిగారు. దాంతో అసలేం జరిగిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. 

 టీవీ షోలు, ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కోసం నిరంతరం మేకప్‌ వేసుకునే టిల్లీ..  రెండు నెలల కిందట టిక్ టాక్‌ లో ఓ అక్యుపంక్చర్ బ్యూటీ టిప్ వీడియో చూసింది. అది నచ్చడంతో అదే తహాలో ప్రయత్నించింది. అయితే అది ఆమెకు రియాక్షన్ ఇచ్చింది.  ముఖం మాడిపోయి, మచ్చలు వచ్చేశాయి. కురుపులు వచ్చేశాయి. మొత్తం తేడా కొట్టింది. దమైన ఫేస్ కాస్తా… అందవికారంగా మారింది. అంతేకాదు ఆమె కంటి చూపు కూడా తాత్కాలికంగా కోల్పోయింది. ఈ ఘటన తర్వాత ఆమె ఆస్పత్రి పాలైంది. ఎవరూ తనలాగా హోమ్‌ మ్యాక్స్‌ చేసుకొవద్దని, సోషల్‌ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. నిపుణుల సలహాతో మేకప్‌ క్రీములు వాడాలని ఆమె సూచించింది.


 

A post shared by T I L L Y 🍒 (@tillywhitfeld)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు