ఆ మ్యాజిక్‌ అలాగే ఉంటుంది

28 Jun, 2021 00:09 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌సింగ్‌

డిజిటల్‌ ఎంటర్‌టైన్‌ స్పేస్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ హవా వల్ల నటీనటులకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ విషయంపై రకుల్‌ ఇంకా మాట్లాడుతూ – ‘‘కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్‌ వైపు ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తున్నారు. మంచి కంటెంట్‌ను ప్రశంసిస్తున్నారు.

పెద్ద తెరపై సినిమాలను చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. అలానే ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ను కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఎన్ని ఉన్నా బిగ్‌ స్క్రీన్‌ సినిమా మ్యాజిక్‌ అలాగే ఉంటుంది. అయితే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు డిజిటల్‌ వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు