పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే..

4 May, 2021 17:25 IST|Sakshi

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్‌ సంపాదించి పెడితే బిగ్‌బాస్‌ ద్వారా తనెంటో ప్రూవ్‌ చేసుకుంది. సీజన్‌-4లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు కూడా ఈ అమ్మడి యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్‌ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..త్వరలోనే ఈ బ్యూటీ మిసెస్‌ అరియానాగా మారనుందట.


అయితే ఈమె పెళ్లాడే ఆ వరుడు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. మరోవైపు ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని ప్రకటించాడు అవినాష్‌. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ ఓపెన్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో అరియానా పెళ్లి మ్యాటర్‌ వెలుగులోకి రావడంతో ఫ్యాన్స్‌లో సందేహాం మొదలైంది. కొంపదీసి వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్‌ షో నుంచి ఎంతో క్లోజ్‌గా మూవ్‌ అయిన అరియానా-అవినాష్‌లపై ఇప్పటికే పలు పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేస్తూ తాము జస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పుకొనే ఈ జంట మరి ఈ వార్తలపై  స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది?
యాంకర్‌ రవి కారులో.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన లాస్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు