ఇండియా చేరుకున్న కౌశల్‌ భార్య.. ' జై పారాసిటమాల్‌' అంటూ..

7 Jun, 2021 12:44 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా పాపులర్‌ అయిన నటడు కౌశల్‌ మండా. అప్పటివరకు బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా గుర్తింపు పొందినా బిగ్‌బాస్‌తో ఎనలేని క్రేజ్‌ దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్‌ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత  కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. ఇటీవల భార్య నీలిమ ఆరోగ్యంపై కౌశల్‌ చేసిన పోస్టులు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. యూకేలో ఉద్యోగం చేస్తున్నానని, ఆ సమయంలో తాను కోవిడ​ బారినపడినట్లు నీలిమ పేర్కొంది.

అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తనకు సరైన ట్రీట్‌మెంట్‌ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి వైద్య సిబ్బంది తనకు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారని వివరించింది. దీంతో నీలిమ త్వరగా కోలుకోవాలంటూ కౌశల్‌ అభిమానులు సహా పలువరు నెటిజన్లు కోరుకున్నారు. తాజాగా నీలిమ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్‌ రావడంతో ఆమె వెంటనే ఇండియాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కౌశల్‌ దృవీకరించారు. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌( NHS )నుంచి తనకు సర్టిఫికెట్‌ వచ్చింది. దీంతో నీలిమ భారత్‌కు చేరుకుంది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు..జై పారాసిటమాల్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ సైతం కృతఙ్ఞతలు తెలిపారు. ఇక కౌశల్‌ పోస్టుతో అతని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. 

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda)

చదవండి : బిగ్‌బాస్‌ ఫేమ్‌ నోయల్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?
ఇండియాలో కన్నా ఇక్కడే దారుణం: కౌశల్‌ భార్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు