అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది: సోహేల్‌

11 Jun, 2021 13:26 IST|Sakshi

సోహేల్‌... బిగ్‌బాస్‌ షోతో ఎనలేని క్రేజ్‌ సంపాదిచుకున్నాడు.  అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది.హౌజ్‌లో‌ ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. వంద రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన  సోహేల్‌ ఈ సీజన్‌లో‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వీపరితంగా పెరిగిపోయింది. సీజన్‌ విన్నర్‌ కన్నా అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక సీజన్‌ ఫినాలే రోజు తనకు వచ్చిన డబ్బుల్లో కొంత పేదల కోసం ఖర్చుపెడతానని ప్రకటించిన సోహేల్‌కు నాగార్జున నుంచి 10 లక్షల ఆఫర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు  'సోహీ హెల్పింగ్‌ హ్యాండ్స్‌' అనే ఛారిటీ ద్వారా ఇప్పటివరకు తాను చేసిన సేవా కార్యక్రమాలు, దానికి అయిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించాడు.

'నాలుగు ఆపరేషన్లు సక్సెస్‌ అయ్యాయి. చాలామందికి నిత్యావసరాలు అందించాం. సోహీ హెల్పింగ్‌ హ్యాండ్స్‌, సోహెలియన్స్‌ మద్దతుతో ఇదంతా చేశాం. అలా ఇప్పటివరకు 14 లక్షల 70వేల 250 రూపాయలు జమ అయ్యాయి. వీటితో పాటు నాగార్జున సర్‌ ఇచ్చిన పది లక్షలు కలిపి ఎంతో మంది అనాథలకు, నిరుపేదలకు సహాయం చేశాం. అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది. ఇంక ఇలానే ఇది కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్‌లో కొంత వీటికి ఖర్చుపెడతానని తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే 100మంది జూనియర్‌ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఎవరికి తోచినంత వారు పక్కన వాళ్లకి సహాయం చేస్తే ఆ కిక్కే వేరు అంటూ తన స్టైల్‌లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్‌ వింజనంపతి డైరెక‌్షన్‌లో సోహేల్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)

చదవండి : ఆట సందీప్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపిన మెగాస్టార్‌ చిరంజీవి
సీరియల్స్‌ కంటే ముందు ‘వంటలక్క’ రియల్‌ ప్రొఫెషన్‌ ఇదే!


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు