బిగ్‌బాస్‌: షటప్‌ అంటూ అభిపై హారిక సీరియస్‌

19 Oct, 2020 17:36 IST|Sakshi

బిగ్‌బాస్‌ అంటేనే వివాదాలు, కాంట్రవర్సీలు, ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని ట్రై చేసిన కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చు పెట్టడమే బిగ్‌బాస్‌ పని. అయితే ఈ చిచ్చులకు పునాది వేదేది మాత్రం ప్రతి సోమవారమే. అవును ఆ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉంటుంది. దీంతో ఆ రోజంతా హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్‌. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ని జతలుగా విడదీసి, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చెప్పి వారిపై రంగు నీళ్లు పోయాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే  అభిజిత్‌-హారిక, అవినాష్‌-సోహైల్‌, మోనాల్‌-అఖిల్‌, అరియానా-మెహబూబ్, లాస్య-దివి‌లను జంటలుగా విడిపోయారు.


 

ఇక కెప్టెన్‌ కారణంగా నోయల్, నాగార్జున ఇచ్చిన ఆఫర్‌తో రాజశేఖర్‌ మాస్టర్‌ ఈ నామినేషన్‌ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. ఇక తాజా ప్రోమో చూస్తే.. అభిజిత్‌- హారిక మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. త్యాగాలు, సర్దుబాట్లు చేసుకునే వారం కాదు ఇది అంటూ హారిక అభికి హారిక సలహా ఇచ్చింది. అయితే ఎక్కువగా నేను నామినేట్‌ అయ్యానని, ఈ వారం తనను సేవ్‌ చేయాలని హారికను అభి కోరాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ హారిక మాత్రం మాఇద్దరిది అన్‌పేయిర్‌ అని, షటప్‌ అంటూ అభిపై సీరియస్‌ అయింది. ఇక అరియానా- మెహబూబ్‌, అవినాష్‌-సోహైల్‌ కూడా నేనే ఉంటా అంటే నేనే ఉంటా అంటూ గొడవకు దిగారు. మరి ఈ వారం ఎవరెవరిపై రంగుపడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా