సిద్దార్థ్‌ శుక్లా నన్ను చాలా హింసించాడు...

2 Sep, 2020 16:02 IST|Sakshi

న్యూఢిల్లీ: బిగ్ బాస్ 13 నుంచి ఇటీవల బయటకు వచ్చిన కంటెస్టెంట్‌ కేసరి లాల్ యాదవ్ తన సహచరుడు సిద్దార్థ్ శుక్లా గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. సిద్థ్‌ తనను 'హింసించే యంత్రం' అని ఆరోపించారు. కేసరి లాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ‘రెండు వారాల పాటు సిద్దార్థ్‌ శుక్లా నన్ను చాలా హింసించాడు. అతను చాలా సమస్యలను సృష్టించాడు. అతను హింసించే యంత్రంలా మారాడు.  మూడవ వారంలో, అతను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మేమిద్దరం మంచి బంధం కలిగి వున్నాం. అతను తన తప్పును తెలుసుకున్నాడు. నేను ఎలిమినేట్‌ అయినప్పుడు చాలా బాధపడ్డాడు’ అని తెలిపారు. 

ఇంకా ఈ షో గురించి మాట్లాడుతూ, ‘ఈ కార్యక్రమ ఫార్మాట్‌ నాకు  సరిపోలేదు. ఈ ఇంట్లో మనుషులు దెయ్యాలుగా మారారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటేనే షోలో తమకు ప్రాధాన్యత వస్తుందని వారు భావించారు. నేను అలాంటి జీవితాన్ని ఇప్పటి వరకు గడపలేదు. నేను అనవసరమైన గొడవలలో తల దూర్చను, ఇతరులను దూషించలేను’ అని తెలిపారు. దాదాపు రెండు వారాల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో గడిపిన కేసరి లాల్‌ శుక్రవారం ఎలిమినేట్‌ అయ్యారు.   చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్‌ విన్నర్ పెళ్లి‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు