నెల రోజులు ఆల‌స్యం కానున్న బిగ్‌బాస్‌!

25 Aug, 2020 20:19 IST|Sakshi

బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ హిందీ 14 వ సీజ‌న్ కోసం ప్రేక్ష‌కులు రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్రారంభం అవుతుంద‌నుకున్న బిగ్‌బాస్‌ను ఫాలో అయేందుకు అంతా సిద్ధ‌మ‌య్యారు. కానీ వారి ఆశ‌ల‌ను నిరాశ చేస్తూ ఓ పిడుగులాంటి వార్త వినిపిస్తోంది. ఈ షో మ‌రో నెల రోజుల పాటు ఆల‌స్యం అవ‌నుంద‌ని స‌మాచారం. వాతావ‌ర‌ణ ప్ర‌భావ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఓ ఆంగ్ల మీడియా క‌థ‌నం వెలువ‌రించింది. ముంబైలో గ‌త వారం రోజులుగా కురుస్తున్న‌ భారీ వర్షాల కార‌ణంగా బిగ్‌బాస్ హౌస్ సెట్ ఇంకా పూర్తి అవ‌లేదు. ఎక్క‌డి ప‌నులు అక్కడే ఆగిపోయాయి. అంతేకాకుండా అప్ప‌టి వ‌ర‌కు వేసిన సెట్ కూడా కొన్నిచోట్ల దెబ్బ తింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌–4కు రెడీ అవుతున్న కమల్‌ )

ఇప్ప‌టిక‌ప్పుడు హ‌డావుడిగా బిగ్‌బాస్ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయ‌డం దాదాపు అసాధ్యం. దీంతో నిర్వాహ‌కులు త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఈ షోను నెల రోజుల పాటు వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టివ‌ర‌కు అన్నీ చ‌క్క‌దిద్దుకుంటే అక్టోబ‌ర్ మొద‌టి వారంలో షో ప్రారంభం కానుంది. కాగా ఈ షోకు 11వ సారి బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది తెలిసిన విష‌య‌మే. మ‌రోవైపు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను షో ప్రారంభానికి కొన్ని రోజుల ముందు క్వారంటైన్‌కు త‌ర‌లించ‌నున్నారు. క్వారంటైన్ ముగిసిన త‌ర్వాత‌ వారికి మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు చేసి, ఆరోగ్య స్థితిని ప‌రిశీలించిన‌ త‌ర్వాతే లోనికి పంపించ‌నున్నారు. (చ‌ద‌వండి: సెప్టెంబ‌ర్‌లో బిగ్‌బాస్; అతడికి 16 కోట్లు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా