రాహుల్ లేక‌పోతే బిగ్‌బాస్ చూడం!

5 Dec, 2020 16:58 IST|Sakshi

బిగ్‌బాస్‌పై రాహుల్ ఫ్యాన్స్ మండిపాటు

హిందీ బిగ్‌బాస్ 14వ సీజ‌న్‌లో పాల్గొన్న సింగ‌ర్ రాహుల్ వైద్య త‌ర‌చూ వార్త‌ల్లో ఉంటున్నాడు. ఆ మ‌ధ్య త‌న‌కు బంధుప్రీతి అంటే అస‌హ్య‌మని చెప్తూ జాన్ కుమార్‌ను నామినేట్ చేశాడు. జాన్‌కు అంత పాపులారిటీ లేద‌ని, కేవలం ప్ర‌ముఖ సింగ‌ర్ కుమార్ స‌ను కొడుకు కావ‌డం వ‌ల్లే ఈ షోలో ఉండ‌గ‌ల్గుతున్నాడ‌ని విమ‌ర్శా బాణాలు ఎక్కుపెట్టాడు. హౌస్‌లో నెపోటిజ‌మ్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చినందుకు వ్యాఖ్యాత‌ స‌ల్మాన్ ఖాన్ తీవ్రంగా మండిప‌డ్డారు. ఈ ఒక్క విష‌య‌మనే కాదు ఆయ‌న చాలామ‌టుకు ఇత‌ర కంటెస్టెంట్ల‌పై నోరు పారేసుకుంటూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎలిమినేట్ అవుతున్నందున రాహుల్ పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (చ‌ద‌వండి: టాప్‌​ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ లిస్ట్‌ : అల్లు అర్జున్‌ ఏ ప్లేస్‌)

ఈ ఎలిమినేష‌న్ వాస్త‌వ‌మే అన్న‌ట్లుగా క‌ల‌ర్స్ టీవీ తాజాగా ప్రోమోను సైతం రిలీజ్ చేసింది. అందులో రాహుల్‌తో మాట‌లు క‌లిపిన స‌ల్మాన్ త‌ర్వాత అత‌డిని బ‌య‌ట‌కు ర‌మ్మ‌ని ఫైర్ అయ్యాడు. స‌ల్మాన్ ఆదేశాల మేర‌కు బిగ్‌బాస్‌ ‌గేట్లు కూడా తెరుచుకున్న‌ట్లు ప్రోమోలో చూపించారు. దీంతో నిజంగానే రాహుల్‌ను ఎలిమినేట్ చేస్తున్నారా? అని అత‌డి అభిమానులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాహుల్ లేక‌పోతే బిగ్‌బాస్ షో లేద‌ని విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. అత‌డిని పంపించేస్తే షో చూడ‌బోమ‌ని తేల్చి చెప్తున్నారు. మ‌రోవైపు రాహుల్‌తో పాటు నిక్కీ తంబోళి కూడా ఎలిమినేట్ కానున్న‌ట్లు మ‌రో వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి రాహుల్ ఎలిమినేట్ అయ్యాడా? సేవ్ అయ్యాడా? లేదా డ‌బుల్ ఎలిమినేష‌న్ జ‌రగ‌నుందా? అనే విష‌యం తెలియాలంటే ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌య్యేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. (చ‌ద‌వండి: ఆ న‌టి నా భార్య‌, కానీ మ‌రొక‌రితో ఎఫైర్‌..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా