బిగ్‌బాస్ గ్రాండ్ లాంచింగ్‌కు స‌ల్మాన్ రెడీ

22 Sep, 2020 17:40 IST|Sakshi

ఈపాటికి మొద‌లు కావాల్సిన హిందీ బిగ్‌బాస్ అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మవుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్రేక్ష‌కుల‌ను ఇంకా వెయిట్ చేయించ‌డం భావ్యం కాద‌ని భావించిన నిర్వాహ‌కులు వ‌చ్చే నెల మూడో తేదీకి ముహూర్తం పెట్టేశారు. ఈ విష‌యాన్ని ఇదివ‌ర‌కే ప్రోమోలు రిలీజ్ చేసి మ‌రీ వెల్ల‌డించారు. అయితే గ‌త సీజ‌న్ల టీఆర్పీ రికార్డులు మ‌ట్టికొట్టుకుపోయేలా షోను గ్రాండ్‌గా స్టార్ట్ చేయాల‌ని నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం అటు బిగ్‌బాస్ టీమ్‌తో పాటు ఈ సీజ‌న్ వ్యాఖ్యాత, బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.‌ ఈ మేర‌కు తాజాగా రిలీజ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. (లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా)

ఇందులో స‌ల్లూభాయ్‌ కెమెరా ముందు నిల‌బ‌డి, షోలో త‌ను చెప్పాల్సిన డైలాగుల‌ను, యాక్ష‌న్‌ను రిహార్స‌ల్స్ చేస్తున్నాడు. కెమెరామెన్లు, ఇత‌ర స‌హాయ‌క సిబ్బంది కూడా ప‌నిలో త‌ల‌మున‌క‌లై క‌నిపించారు. షోలో కొత్త‌ద‌నం తీసుకొచ్చేందుకు, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు బాగానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా అక్టోబ‌ర్ 3(శ‌నివారం)న‌ ప్రారంభం కానున్న ఈ షో సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 10.30 గంట‌ల‌కు, శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ బుల్లితెర నుంచి వెండితెర వ‌ర‌కు ఎంద‌రో సెల‌బ్రిటీల‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో నియా శ‌ర్మ‌, ఆకాంక్ష పూరి, నైనా సింగ్‌, నిశాంత్ మ‌ల్క‌నీ స‌హా ప‌లువురి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరు హౌస్‌లో అడుగుపెట్టేది నిజ‌మా?  కాదా? అని తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే. (బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది!)

Here's a sneak peek of the asli #BehindTheScenes with the one and only @beingsalmankhan! #BiggBoss Grand Premiere, 3rd Oct, Saturday raat 9 baje, sirf #Colors par. Catch #BiggBoss2020 before TV on @vootselect. #AbScenePaltega #BB14 @plaympl

A post shared by Colors TV (@colorstv) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా