గోళ్ల‌తో ర‌క్కిన కంటెస్టెంటు, క‌ళ్ల‌కు గాయాలు

14 Oct, 2020 19:44 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్ 14వ సీజ‌న్‌లో పంజాబీ సింగర్, న‌టి సారా గుర్పాల్ మొద‌టి వారంలోనే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆమె ఎలిమినేష‌న్‌ను చాలామంది త‌ప్పు ప‌ట్టారు. కానీ ఆమెను పంపించేయ‌డం వెన‌క ఆరోగ్య కార‌ణాలు కూడా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్న ఆమె ఫొటోలే నిద‌ర్శ‌నం. ఈ ఫొటోల్లో ఆమె క‌ళ్ల‌కు తీవ్ర గాయాలైన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ గాయం ఎలా అయిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో గ‌త వారం ఇమ్యూనిటీ టాస్క్ జ‌రిగింది. అందులో భాగంగా సారా బుల్డోజ‌ర్ ఎక్కి కూర్చుంది. ఆమెను తోసేసి కూర్చునేందుకు నిక్కీ తంబోలి త‌న గోళ్ల‌తో సారా క‌ళ్ల ద‌గ్గ‌ర రక్కింది. ఈ ఫుటేజీని బిగ్‌బాస్ టీమ్ ఎడిట్ చేసి తీసేసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: రెయిన్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన అమ్మాయిలు)

కానీ మిగ‌తా కంటెస్టెంట్లు దీని గురించి మాట్లాడుకోవ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న‌ను గాయ‌ప‌రుస్తున్నా స‌రే సారా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేకుండా గేమ్ ఆడ‌టంపైనే దృష్టి పెట్ట‌డం విశేషం. ఇక ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చిన సారా ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటోంది. ఆ వెంట‌నే ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. కాగా బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ 14 అక్టోబ‌ర్ 3న ఆడంబ‌రంగా ప్రారంభమైన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 11 మంది కంటెస్టెంట్లు రుబీనా దిలైక్‌, ఆమె భ‌ర్త అభిన‌వ్ శుక్లా, ఎజాజ్ ఖాన్‌, జాస్మిన్ బాసిన్‌, నిశాంత్ సింగ్ మ‌ల్కానీ, ప‌విత్ర పూనియా, నిక్కీ తంబోలి, సారా గుర్పాల్‌, రాహుల్ వైద్య‌, హెహ‌జాద్ డియోల్‌, జాన్ కుమార్ సాను, రాధే మా పాల్గొన్నారు. (చ‌ద‌వండి: రణ్‌బీర్‌, అలియా వివాహం అప్పుడే!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు