బిగ్‌బాస్‌: శ్రుతి మించిన రొమాన్స్‌

7 Nov, 2020 13:09 IST|Sakshi

బిగ్‌బాస్‌... అక్కడ అనుక్షణం ఎమైనా జరగొచ్చు. చివరి వరకు ఉంటారనుకున్న వారు మధ్యలోనే వెళ్లిపోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వారు ఫైనల్‌కి రావొచ్చు. కంటెస్టెంట్ల ప్రవర్తన వారి ఆటను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇక వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ షోలలో హిందీ బిగ్‌బాస్‌కు క్రేజ్‌ ఎక్కువ. అక్కడ కంటెస్టెంట్లు, టాస్కులు, ఆట విధానం ఒకింత భిన్నంగా ఉంటాయి. ఇంటి సభ్యుల ప్రవర్తన, గొడవలు కూడా వేరే లెవల్‌లో ఉంటాయి. హిందీలో ఇప్పటి వరకు 13 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రస్తుతం 14 వ సీజన్‌ కొనసాగుతుంది. అక్టోబర్‌ 3న ప్రారంభమైన ఈ షోలో గత సీజన్‌లలో పాల్గొన్న, గెలిచిన ప్రముఖ వ్యక్తులను తీసుకు రావడం విశేషం. చదవండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ను ఇంటికి పంపించాల్సిందే.. 

34 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌లో అయిదవ వారం కొనసాగుతోంది. ఇంట్లో ప్రస్తుతం ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. అసలే హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల్లో కొంతమంది మరింత రెచ్చిపోయారు. అందులోనూ ఈరోజు రేపు (శని, ఆది) వీకెండ్‌ కావడంతో ఫన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. శనివారం వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌ ప్రోమోలో జాస్మిన్‌ బాసిన్‌-అలీ గోని, అభినవ్‌ శుక్లా- రుబినా దిలైక్‌, నిక్కి తంబోలి- జాన్‌ కుమార్‌ సాను, ఐజాజ్‌ ఖాన్‌- పవిత్ర పునియా జంటలుగా ఏర్పడి ఒకరికొకరు నువ్వానేనా అన్నట్లు ప్రవర్తించారు. చదవండి: ప్రేమలో ఉన్నట్లు చెప్పిన బిగ్‌బాస్‌ ఫేం

శనివారం నాటి ఎపిసోడ్‌లో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వచ్చి ఇప్పటి నుంచి బిగ్‌బాస్‌ ఇంట్లో సెలబ్రెషన్స్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జాస్మిన్‌, అలీ హిందీ పాటకు డ్యాన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అభినవ్‌ తన భార్య రుబినాతోకలిసి హిట్‌ సాంగ్‌ తుహైబివి నెం1 అనే పాటను ఆలపించారు. అంతేగాక రియాలిటీ షోలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఒకరినొకరు కిస్‌ చేసుకున్నారు. అనంతరం షారూఖ్ ఖాన్ పాటకి రాహుల్ వైద్య డ్యాన్స్‌ చేశాడు. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ సినిమా నుంచి ఐ యామ్ ది బెస్ట్ పాటకు స్టెప్పులువేశాడు. అంతేగాక ఈరోజు ఎపిసోడ్‌లో ఓ గెస్ట్‌ రానున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రెమో డి సౌజాతో పాటు సల్మాన్ యూసుఫ్, పునిత్ పాథక్, షాకి మోహన్‌..వీరంతా ఇంటి సభ్యులతో కలిసి హౌజ్‌లో సందడి చేయనున్నారు. చదవండి: నేను ప్రెగ్నెంట్‌ కాదు: బిగ్‌బాస్‌ నటి

మరిన్ని వార్తలు