బిగ్‌బాస్‌ రియాల్టీ షో: భూమిక క్లారిటి!

6 Jun, 2021 15:14 IST|Sakshi

బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ రియాలిటీ షోకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షోకు స్టార్‌ హీరోలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, కన్నడలో కిచ్చా సుదీప్‌, తమిళంలో కమల్‌ హాసన్‌. హిందీలో సల్మాన్‌ ఖాన్‌, మలయాళంలో మోహన్‌లాల్‌ హోస్ట్‌గా అలరిస్తున్నారు. 

ఇదిలా వుంటే నటి భూమిక బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోతుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో ఆమె ఎంట్రీ ఖాయం అన్నట్లుగా పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన భూమిక వాటిని అసత్య కథనాలుగా కొట్టిపారేసింది. తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది.

'నేను బిగ్‌బాస్‌ షోకు వెళ్తున్నాననేది ఫేక్‌ న్యూస్‌.. నాకు బిగ్‌బాస్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా నేను వెళ్లను. గతంలో 1,2,3 సహా మరికొన్ని సీజన్లకు సైతం నన్ను సంప్రదించారు. కానీ నేను అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా బిగ్‌బాస్‌కు వెళ్లే ప్రసక్తే లేదు. 24 గంటలు కెమెరాలు ముందే ఉండటం నాకిష్టం లేదు' అని భూమిక చెప్పుకొచ్చింది.

చదవండి: బిగ్‌బాస్‌ ఫేమ్‌ నోయల్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?

'మన్మథుడు' హీరోయిన్‌ ఎక్కడుందో తెలుసా?

మరిన్ని వార్తలు