Bigg Boss 15: బిగ్‌బాస్‌ పేరు మారింది, టీవీకంటే ముందు ఓటీటీలోకి

9 Jul, 2021 17:43 IST|Sakshi

ప్రముఖ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్‌ ఈసారి సరికొత్తగా ఉండనుంది. ప్రేక్ష​కులకు వినూత్న అనుభూతిని అందించేందుకు షో నిర్వహకులు ఈ సీజన్‌ను కొత్తగా ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 15 నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ పేరు నుంచి కంటెస్టెంట్స్‌ ఎంపీక వరకు అన్ని మారాయి. తాజాగా మేకర్స్‌ బిగ్‌బాస్‌ పేరును బిగ్‌బాస్‌ ఓటీటీగా మార్చి లోగోను విడుదల చేశారు. అంతేగాక ఈ సీజన్‌ తొలి ఆరు వారాల ఎపిసోడ్స్‌ ఓటీటీలో ప్రసారం కానున్నాయి. ఆ తర్వాత టీవీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌(voot)లో బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రసారం కానుంది.

మరో విశేషం ఎంటంటే ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉండటమే. ఈ సందర్భంగా వూట్‌(voot) హెడ్‌ ఫర్జాద్‌ పాలియా మాట్లాడుతూ.. ‘డిజిటల్‌ ఫస్ట్‌ అనే నినాదానికి అనుగుణంగా బిగ్‌బాస్‌ ఓటీటీతో మా సంస్థ మరో ముందడుకు వేసింది. బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్‌ ఓటీటీను లాంచ్‌ చేయనున్నాం’ అని చెప్పుకొచ్చారు. కాగా హిందీ బిగ్‌బాస్‌ ఇప్పటికే 14 సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. ఈ షోకు గత కొన్ని సీజన్లుగా బాలీవుడ్‌ కండల వీరుడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనదైన యంకరింగ్‌తో భాయిజాన్‌ సీజన్‌ సీజన్‌కు షోను ఆసక్తిగా మలుస్తున్నాడు. 

మరిన్ని వార్తలు