ఖరీదైన కారు కొన్న శివజ్యోతి

9 Jan, 2021 19:09 IST|Sakshi

తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే శివజ్యోతి కొత్త కారు కొన్నది. గతేడాది కొత్తిల్లు కొని గృహప్రవేశం చేసిన ఆమె ఈసారి కారు కొనుగోలు చేసింది. మరి కారు కొన్నాక ఫొటోలు దిగకపోతే ఎలా? అందుకే భర్త గంగూలీతో కలిసి కారు ముందు ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. దీంతో "ఇది ఆరంభం మాత్రమే", "సక్సెస్‌ జర్నీ స్టార్ట్‌ అయింది" అంటూ ఈ ఫొటోలను బిగ్‌బాస్‌ ఫేం రవికృష్ణ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హిమజ కూడా శివజ్యోతి కారు కొన్నందుకు కంగ్రాట్స్‌ చెప్పింది. అటు అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి: ‘టైటానిక్’‌ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది..)

కాగా తీన్మార్‌ వార్తలతో సావిత్రక్కగా ఫేమస్‌ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె బంధాలకు ప్రాధానమ్యిస్తూనే తన ఆట తను ఆడి అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో ప్రతిదానికి ఏడుస్తూ పాతాళగంగలా పేరు తెచ్చుకుంది. కంటెస్టెంట్లు అలీ రెజా, రవి కృష్ణలను సొంత తమ్ముళ్లలా భావిస్తూ రాఖీలు కూడా కట్టింది. బిగ్‌బాస్‌లో తనకు మంచి స్నేహితులుగా ఉన్న హిమజ, రోహిణిలను తరచూ కలుస్తూ ఎప్పుడూ పార్టీలు చేసుకుంటోంది. ఈ మధ్యే తన ‍గ్యాంగ్‌తో సహా వితికా షెరు చెల్లి పెళ్లికి హాజరై అక్కడ సందడి చేసింది. (చదవండి: నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్‌)

A post shared by Himaja💫 (@itshimaja)

మరిన్ని వార్తలు