బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?

21 Sep, 2020 17:17 IST|Sakshi

బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌‌ సీజన్‌ 4.. ఆదివారంతో రెండు వారాలను పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్‌ కాస్తా కోపాలు, ఏడుపులు, సరదాలతో ముగియగా సోమవారం రావడంతో హౌజ్‌లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అయితే గత వారం నామినేషన్‌ చాలా సులువుగా త్యాగాలు చేస్తూ జరిగిందని నాగార్జున ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్‌ మిగతా వాటితో పోలిస్తే చాలా వేడిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఎవరిని నామినేట్‌ చేయాలన్న విషయంలో కంటెస్టెంట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. (బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది!)

ఈ వారం ఎవరిని నామినేషన్‌లో ఉంచాలో వారి ఫోటోలను మండుతున్న అగ్నిలో వేయాల్సి ఉంటుంది. అలాగే వారిని నామినేట్‌ చేయడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. కాగా ఈ నామినేషన్‌ ప్రక్రియపై శనివారం జరిగిన హీరో, జీరో టాస్క్‌ ఎఫెక్ట్‌ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు ఈ ఎపిసోడ్‌తో ఒక్కసారిగా శత్రువులుగా మారబోతున్నారు. ఈ క్రమంలో ఇస్మార్ట్‌ సోహైల్‌ తన స్నేహితురాలు అరియానా గ్లోరీ ఫోటోను మంటల్లో వేయగా.. బదులుగా అరియానా.. సోహైల్‌ ఫోటోను మంటల్లో ఆహుతి చేసింది. (బిగ్‌బాస్‌: హారిక అవుట్! కానీ..)

అలాగే సుజాత- అభిజిత్‌ ఫోటోను మంటల్లో వేసింది. అంతేగాక అభిజిత్‌ సుజాత ఫోటోను మంటల్లో వేశాడు. ఇలాగే మోనాల్‌- దివి, దివి-మోనాల్‌, దేత్తడి హారిక- మోహబూబా, మోహబూబా- హారిక, దేవి- అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఫోటోను మంటల్లో తగలబెట్టింది. ఇక పూర్తి నామినేషన్‌ ఎలా జరగబోతుంది. ఎవరూ ఈ వారం నామినేషన్‌లో ఉండబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ చూసే వరకు ఆగాల్సిందే. (దివి, నోరు అదుపులో పెట్టుకో: లాస్య‌ వార్నింగ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు