బిగ్‌బాస్‌-4: ఈ సారి సరికొత్త వినోదంతో

15 Aug, 2020 20:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన నాన్‌ ఫిక్షన్‌ షో బిగ్‌బాస్‌-4 త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2017లో స్టార్‌ మాలో ఒక సంచలనంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ ప్రతి సిజన్‌లోను ప్రేక్షకులను సరికొత్తగా వినోదాన్ని అందిస్తూ వస్తోంది. అద్భతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ  బిగ్‌బాస్‌ సీజన్‌ సీజన్‌కు ఎదుగుదలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌-4 ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున మూడు జనరేషన్‌లుగా నటిస్తూ ఇచ్చిన ప్రకటన అంచనాలను పెంచడమే కాకుండా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. (చదవండి: బిగ్‌బాస్‌ 4 ప్రోమో.. గోపి ఎవరు?)

వరసగా రెండోసారి హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హౌజ్‌ను నాగార్జున నడిపించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌ ఫ్లోర్‌కి రావడం సరదాగా ఉందన్నారు. గత సీజన్‌ గొప్ప విజయం అందుకున్న తరువాత ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సర్‌ప్రైజ్‌ కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రచార చిత్రంలో తన లుక్‌ గురించి నాగార్జున మాట్లాడుతూ ‘మూడు పాత్రలు చేయడం, పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజీ మెయిన్‌ చేయడం, వాయిస్‌లో జాగ్రత్తలు, మేనరిజంలో వైవిధ్యం చూసుకుంటూ అదీ తక్కువ సమయంలో షూట్‌ చేయడం పెద్ద ఛాలెంజ్‌. కానీ నేను దాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.

జీవితం, ఆశ, వినోదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నేను నమ్ముతున్నాను. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌లో సంపూర్ణమైన వినోదాన్ని అందించబోతున్నాం‌’ అని అన్నారు.  స్టార్‌ మా అధికార ప్రతినిధి మాట్లాడుతూ అర్థవంతమైన కంటెంట్‌, విభిన్నమైన అంశాలతో  ఉత్తమమైన వినోదాన్ని మేము అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం. ప్రతి బిగ్‌బాస్‌ సీజన్‌లో మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకులు బాగా ఇష్టపడే షోలలో ఒకటైన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను ప్రేక్షకులు తమ ఇళ్లలో కూర్చునే ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.  (చదవండి: బిగ్‌బాస్‌ 4: కెమెరా, యాక్షన్‌ వాట్‌ ఏ వావ్‌..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు