ఈ యంగ్‌ హీరోను గుర్తుపట్టారా?

22 Jan, 2021 14:33 IST|Sakshi

పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు? బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో బుద్దిబలంతో టాస్కులు గెలవడంతో పాటు అమ్మాయిల మనసు దోచుకున్న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అభిజిత్‌. చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటో ఆయన అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ ప్రేమ అన్న క్యాప్షన్‌తో ఈ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. కాగా ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌లో అభి అమ్మ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. మీరు కొట్టుకోండి, అదే కదా మజా అంటూ కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో ఆమె కూడా పాపులర్‌ అయింది. (చదవండి: బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌)

కేవలం ఎక్స్‌పీరియన్స్‌ కోసమే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చానన్న అభి తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ప్రేక్షకులు చూపించిన ప్రేమలో తడిసి ముద్దైన అతడు సోషల్‌ మీడియాలో వారికి నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్‌ ప్రయాణంలో తనకు సపోర్ట్‌ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మధ్యే తన స్నేహితుడు, క్రికెటర్‌ హనుమ విహారిని కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు అభి వీరాభిమాని అని తెలిసిన హనుమ విహారి ఈ విషయాన్ని హిట్‌మ్యాన్‌ చెవిన వేశాడు. దీంతో రోహిత్‌ అభికి ఫోన్‌ చేసి మాట్లాడటమే కాక ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. (చదవండి: ఇండియా లాక్‌డౌన్‌.. టైటిల్‌ పోస్టర్‌ విడుదల)

A post shared by Abijeet (@abijeet11)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు