నోయ‌ల్ టైటిల్ గెల‌వాల్సింది: అభిజిత్‌

19 Dec, 2020 23:24 IST|Sakshi

నోయ‌ల్ రాక‌తో అభిజిత్ ఎమోష‌న‌ల్‌

జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ పండించిన ఎంట‌ర్‌టైన‌ర్‌

రీయూనియ‌న్ వేడుక‌ల్లో క‌నిపించ‌ని ఆ ముగ్గురు

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఆఖ‌రుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గ‌డిపారు. ఎలిమినేట్ అయిన‌వాళ్ల‌ను తిరిగి హౌస్‌లో చూస్తున్నందుకు ఓప‌క్క సంతోషం, త‌ర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండ‌ద‌న్న మ‌రో వైపు బాధ వాళ్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్‌లో చివ‌రి రోజు కొంత ఎమోష‌న‌ల్‌గా సాగింది. అయితే దేవి నాగ‌వ‌ల్లి, సూర్య కిర‌ణ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాత్రం రీయూనియ‌న్ పార్టీకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చ‌దివేయండి..

ఇంటి నుంచి సందేశం..
అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగ‌వ్వ లోప‌ల‌కు వ‌చ్చింది. అవ్వ పిలుపు విన‌గానే అఖిల్ ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. ఆమెను చూడ‌గానే పిల్లాడిలా సంబ‌ర‌ప‌డిపోయాడు. త‌ర్వాత‌ జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వ‌తో క‌లిసి ఫైన‌లిస్టుల‌తో ఆటాడించారు. న‌న్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వ‌చ్చిన మెస్సేజ్‌ను చూపిస్తాన‌‌ని సుజాత బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీప‌డుతూ ఇంట్లోకి ప‌రుగెత్తారు. ఈ క్ర‌మంలో అభి మైకు విర‌గొట్టుకుని మ‌రీ మొద‌ట‌గా కాఫీ మ‌గ్గు తీసుకొచ్చాడు. త‌ర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ ల‌వ్ యూ అని రాసుకొచ్చి మ‌రీ అందించాడు. ఇలా ఎవ‌రికి తోచిన ప్ర‌య‌త్నాలు వారు చేయ‌గా.. ఫైన‌లిస్టులంద‌రికీ కుటుంబ స‌భ్యులు మాట్లాడిన‌ వీడియోలు చూపించారు. అనంత‌రం గంగ‌వ్వ‌, సుజాత ఇద్ద‌రూ వీడ్కోలు తీసుకున్నారు. (చ‌ద‌వండి: కృష్ణుడిలాంటి భ‌ర్త కావాలి: మోనాల్‌)

నేను నిన్ను గెలిచాను..
త‌ర్వాత వ‌చ్చిన‌ నోయ‌ల్‌ ర్యాప్‌తో ఊపేస్తూ అంద‌రి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అత‌డి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్‌ను అభి నోయ‌ల్ చేతికందించాడు. దానిపై 'నోయ‌ల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చ‌దివిన నోయ‌ల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాల‌దా.. అంటూ అభిజిత్‌తో చెప్పుకొచ్చాడు. హౌస్‌ను మిస్స‌వ‌లేదు, కానీ మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్‌బాస్ త‌న‌కు ఎంతో ఇచ్చింద‌ని, కానీ త‌ను ఏమీ తిరిగివ్వ‌లేక‌పోతే క్ష‌మించండి అంటూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే)

దివి.. దీపిక ప‌దుకొణెలా ఉన్నావు
త‌ర్వాత మెహ‌బూబ్‌ను చూడ‌గానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అత‌డు మాత్రం త‌న ఆతృత‌ను లోలోప‌లే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంత‌రం త‌న జిగిరీ దోస్తులు సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌తో క‌బుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవ‌డంతో ఏంటి పులిహోరా? అని దివి ప్ర‌శ్నించింది. మ‌రోప‌క్క మెహ‌బూబ్‌, సోహైల్ భావోద్వేగానికి లోనై క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం ఫైన‌లిస్టులు అన్ని హార్ట్ దిండుల‌ను మెహ‌బూబ్‌, దివికి బ‌హుమ‌తిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్న‌ర్లే అన్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోండ‌ని మెహ‌బూబ్ ప‌దే ప‌దే చెప్తూ సెల‌వు తీసుకున్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: పెద్ద‌గా ఆక‌ట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..)

మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా
త‌ర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వ‌డంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంట‌నే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్క‌పెట్టి ఏడ‌వటంతో ఆమెను ఓదార్చాడు. త‌న‌నిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంట‌ర్‌టైన‌ర్ అని పిలుస్తున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. త‌న ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు క‌లిసేందుకు వ‌స్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా క‌ల‌ప‌డం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండ‌టం చూసి ఏంటి? దినాల‌కు పిట్ట‌కు పెట్టిన‌ట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంత‌రం అంద‌రి హౌస్‌కు గుడ్‌బై చెప్తూ అక్క‌డి నుంచి నిష్క్ర‌మించాడు. త‌ర్వాత ఫైన‌లిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌డే: అలీ రెజా)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు