దివి కిడ్నాప్‌: బూతుల‌తో రెచ్చిపోయిన సోహైల్

23 Sep, 2020 15:36 IST|Sakshi

బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అస‌లు ఎత్తుగ‌డ‌లు నేడు మొద‌లు కానున్నాయి. టాస్క్ కోసం ఎంత‌కైనా తెగించేందుకు రెండు టీమ్‌లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. స్ట్రాంగ్‌గా ఉన్న మ‌నుషుల టీమ్ బ‌లాన్ని ఎలాగైనా అణగ‌దొక్కాల‌ని రోబోల టీమ్ కొత్త  ప‌థ‌కం ర‌చించిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే నిన్న‌టి ఎపిసోడ్‌లో టాస్క్ ప్రారంభం అవ‌గానే మ‌న‌వ‌ల్ల కాదు, గెల‌వ‌లేం, ప్ర‌త్య‌ర్థుల‌ను ఆప‌లేము అంటూ అభిజిత్ రోబోల టీమ్‌లో నిరుత్సాహాన్ని నింపాల‌ని ప్ర‌య‌త్నించాడు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అస‌లు ఎత్తుగ‌డ‌లు నేడు మొద‌లు కానున్నాయి. అభిజిత్ ఆట తీరుపై నెటిజ‌న్లు కూడా మండిప‌డ్డారు. కానీ నేటి ఎపిసోడ్‌లో అభి త‌న మెద‌డుకు బుద్ధి చెప్పిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆట గెల‌వ‌డం కోసం మ‌నుషుల టీమ్‌లో ఒక‌రిని కిడ్నాప్ చేద్దామ‌ని సూచించాడు. అలా రోబోలంద‌రం చార్జింగ్ పెట్టుకుందామ‌న్నాడు. (చ‌ద‌వండి: కెమెరాకు దిండు అడ్డుపెట్టి ఆరుబ‌యటే కానిచ్చేశారు)

అనుకున్న‌ట్టుగానే క‌రెక్ట్‌ స‌మ‌యం చూసి లోనికి వ‌చ్చిన దివిపై రోబోలు మూకుమ్మ‌డిగా ప‌డిపోయి, క‌నీసం ఆమె క‌ద‌ల‌డానికి కూడా వీలు లేకుండా ప‌ట్టేసుకున్నారు. సాయం కోసం అర్థించిన దివి కేక‌లు విని, బ‌య‌టున్న మ‌నుషుల టీమ్ తీవ్ర ఆగ్ర‌హానికి గురయ్యారు. సిగ్గుండాలి.. థూ అంటూ సోహైల్ బూతుల‌తో రెచ్చిపోయాడు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్‌, మెహ‌బూబ్‌, మోనాల్, సుజాత‌ కూడా తీవ్రంగా క‌ల‌త చెందారు. ఏదైతేనేం.. నిన్న అభి గేమ్ చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా ఇవాళ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడంటూ మెచ్చుకుంటున్నారు. అతిగా రియాక్ట్ అవుతున్న మెహ‌బూబ్‌, సోహైల్‌ను కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. మ‌నుషుల టీమ్ కాబ‌ట్టి మ‌నుషుల్లాగానే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మ‌రికొంద‌రు వెన‌కేసుకొస్తున్నారు. మ‌రి ఈ ఉక్కు హృద‌యం టాస్క్ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి! (చ‌ద‌వండి: బిగ్‌బాస్: ఇవాళంతా పులిహోర ఎపిసోడే..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు