బిగ్‌బాస్‌ : హారిక నా చెల్లి.. అభిజిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

22 Dec, 2020 15:56 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మొదట్లో  అభిజిత్‌-మోనాల్‌-అఖిల్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఎంత హైలెట్‌ అయిందో చెప్పనక్కర్లేదు. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురికే ఎక్కువ స్క్రీన్‌ స్పెస్‌ ఇచ్చేవాడు బిగ్‌బాస్‌. అయితే బిగ్‌బాస్‌ ఎత్తుగడను పసిగట్టిన మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌.. మోనాల్‌తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్‌- మోనాల్‌ ప్రేమాయణాన్ని హైలెట్‌ చేసి చూపించాడు బిగ్‌బాస్‌. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్‌, లాస్య ఎలిమినేట్‌ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్‌లు, ముద్దులను హైలెట్‌ చేసి చూపించాడు బిగ్‌బాస్‌. దీంతో అభికి హారిక మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 
(చదవండి: బిగ్‌బాస్‌: అభిజిత్‌ విజయానికి కారణాలివే)

ఇక ఆ పుకార్లు నిజమే అన్నట్లు హారిక కూడా అభిజిత్‌ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోయింది. చాలా సందర్భంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను హైలైట్ చేస్తూ ఏదో నడుస్తుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్. దీంతో అభి-హారిక పేర్లను ఏకం చేసి అభిక అని ఫ్యాన్స్ పేజ్‌లు కూడా వచ్చేశాయి. వీరిద్దరూ కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టారని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక వీరిద్దరి పేరెంట్స్‌ కూడా పరోక్షంగా వాళ్లు లవ్‌లోనే ఉన్నారని ఒప్పేసుకున్నారు. హారిక లాంటి కోడలు కావాలని అభి తల్లి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే హారిక తల్లి చెప్పడంతో వీరద్దరి గుండెల్లో గంట మోగిందని ఫ్యాన్స్‌ సంబరపడ్డారు. అయితే ఇదంతా తప్పని, బిగ్‌బాస్‌ తమ రిలేషన్‌ని వేరేలా చూపించారని చెబుతున్నాడు నాల్గో సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌. 

తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్‌లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్‌ కోసమే బిగ్‌బాస్‌ అభి, హారిక రిలేషన్‌ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు