బిగ్‌బాస్, మామ‌ధ్య పెట్టింది చాలా‌?: అఖిల్‌

3 Dec, 2020 19:32 IST|Sakshi

బిగ్‌బాస్ ఆడే ఆట‌లో కంటెస్టెంట్లు పావులు మాత్ర‌మే. వీళ్లు బంధాలు, స్నేహాలు అంటూ ఒక‌రినొక‌రు ఎంత అల్లుకుపోయినా బిగ్‌బాస్ మాత్రం ఆ తీగ క‌త్తిరించి వారి మ‌ధ్య చిచ్చు పెట్టేందుకే ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తాడు. ఒక్కోసారి అది బిగ్‌బాస్ ఆడే వింత నాట‌కం అని అర్థ‌మైనా ప‌రిస్థితికి బ‌ల‌వ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు కూడా స‌రిగ్గా అదే జ‌రిగింది. టికెట్ టు ఫినాలే రేసు ఆఖ‌రి రౌండ్‌లో పోటీప‌డుతున్న అఖిల్‌, సోహైల్ మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతోంది. ఎప్ప‌టి విష‌యాలో తవ్వుతూ ఉన్న ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయి.

నేను గ‌ట్స్ ఉన్న గేమ్ ఆడాను..
'నువ్వు కెప్టెన్ అయిన‌ప్పుడు పెట్టిన టాస్క్‌లో నేను 100% ఇచ్చాను' అని అఖిల్ అన‌గానే అంద‌రూ వంద శాతం క‌ష్ట‌ప‌డ్డారని, కానీ చివ‌ర‌గా తాను కెప్టెన్ అయ్యాన‌ని సోహైల్ స్ప‌ష్టం చేశాడు. నేను ఆడిందే ద‌మ్మున్న గేమ్‌ అంటూ ఇద్ద‌రూ వాదులాడుకున్నారు. దీంతో గొడ‌వ ఎక్క‌డికో పోతుంద‌ని అర్థ‌మై అఖిల్ బిగ్‌బాస్‌కే కౌంట‌ర్ వేశాడు. చాలా బిగ్‌బాస్, పెట్టింది చాలా? అని బిగ్‌బాస్‌ను దెప్పి పొడిచాడు. అక్క‌డేమో అభిజిత్‌‌ ‌వీళ్ల పంచాయితీని చూస్తూ కూర్చుండిపోయాడు. అయితే ఎంత గొడ‌వ ప‌డ్డా కాసేప‌టివ‌ర‌కే అన్న‌ది తెలిసిన విష‌య‌మే. ఇంత‌కంటే పెద్దగా ఫైటింగ్ జ‌రిగిన‌ప్పుడు కూడా నిమిషాల్లో క‌లిసి పోయారు. కాబ‌ట్టి జ‌నాలు ఈ గొడ‌వ‌ను లైట్ తీసుకుంటున్నారు. ఈ వాగ్వాదం జ‌రిగిన వెంట‌నే ఇద్ద‌రూ ఓ హ‌గ్గిచ్చుకుని క‌లిసిపోయుంటారు అని కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: ఇక నుంచి నామినేట్ చేయ‌కండి: అభి)

టికెట్ టు ఫినాలే విజేత అఖిల్‌!
"టికెట్ టు ఫినాలే" రేసు విష‌యానికి వ‌స్తే.. పాలు పిత‌క‌డం అనే మొద‌టి రౌండులో క‌లిసి ఆడి అఖిల్‌-సోహైల్‌, అభిజిత్‌-హారిక జంట‌లు త‌ర్వాతి లెవ‌ల్‌కు విజ‌యం సాధించాయి. అవినాష్‌, మోనాల్‌, అరియానా ఓట‌మితో రేసు నుంచి త‌ప్పుకున్నారు. రెండో లెవ‌ల్‌లో సొంతంగానే ఆడాల‌ని బిగ్‌బాస్ స్ప‌ష్టం చేశాడు. ఈ పూలు ప‌ట్టుకునే ఈ రౌండ్‌లో అభి, హారిక పోటీ నుంచి నిష్క్ర‌మించగా అఖిల్‌, సోహైల్ గెలిచారు. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ఉయ్యాల‌లో కూర్చునే గేమ్ ఆడుతున్నారు. ఎవ‌రు మొద‌ట కాలు కింద‌ప‌డితే వాళ్లు ఓడిన‌ట్లే లెక్క‌. ఇక లీకువీరులు చెప్తున్న‌దాని ప్ర‌కారం అఖిల్ గెలిచి టాప్‌5లోకి మొద‌ట చేరుకున్నాడు. (చ‌ద‌వండి: త‌న్నినందుకు సారీ చెప్పిన మోనాల్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు