'అవ్వ బంగారం' అంటూ అఖిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

23 Mar, 2021 12:08 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ గంగవ్వ. యూట్యూబ్‌ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇ‍చ్చి సంచలనమే క్రియేట్‌ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్‌ సార్థక్‌ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్‌ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. 

చాలా రోజులకు అఖిల్‌ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్‌ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్‌ వేసుకున్న జీన్స్‌ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్‌ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది.

ఇక సడన్‌గా అఖిల్‌ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్‌ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్‌లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్‌ కొద్దిగా ఎమోషనల్‌ అయ్యాడు.

చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌..ఇప్పటికే‌..10 లక్షలకు పైగానే లైక్స్‌

గాలి మోటార్‌ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ

ఎమీ హాకిన్స్‌.. మరో గంగవ్వ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు