మోనాల్‌-అభి మ‌ధ్య దూరాన్ని అఖిల్ త‌గ్గిస్తాడా?

27 Oct, 2020 15:34 IST|Sakshi

నామినేష‌న్ అంటేనే గ‌డిచిన రోజుల్లోకి తొంగి చూస్తూ త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూప‌డం. ఈ క్ర‌మంలో నిన్న జ‌రిగిన నామినేష‌న్ ప్రక్రి‌యలో ఇంటి స‌భ్యులు అంద‌రూ ఎప్పుడో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ నామినేట్ చేశారు. అయితే అంద‌రూ వారివారి వ్య‌క్తిగ‌త విష‌యాల మీద దృష్టి పెడితే అమ్మ రాజ‌శేఖ‌ర్ మాత్రం అభిజిత్‌, మోనాల్‌, అఖిల్ ట్రాక్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చాడు. మోనాల్ అభిజిత్ మాట్లాడుకోవ‌డం లేదు. కానీ నువ్వు అభిజిత్‌తో మాట్లాడుతున్నావ్. మోనాల్‌ నీ బెస్ట్‌ఫ్రెండ్ అని చెప్తావు. అలాంట‌ప్పుడు ఆమె అభితో దూరంగా ఉంటే నువ్వు మాత్ర‌మే అత‌నితో మాట్లాడ‌టం న్యాయం కాదు" అని మాస్ట‌ర్ సెల‌విచ్చాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. తానెప్పుడూ మోనాల్‌ను అభితో మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్ప‌లేద‌ని, అది వారిష్టానికి వ‌దిలేశాన‌ని స్ప‌ష్టం చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు నో ఆప్ష‌న్‌: మోనాల్‌ను పంపించాల్సిందే)

మ‌రోవైపు అభిజిత్ కూడా నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎప్పుడో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను గుర్తు చేశాడు. త‌న‌ను మానిప్యులేట్ అన‌డం, దాని గురించి వేరేవాళ్ల‌తో మోనాల్ మాట్లాడ‌టం న‌చ్చ‌లేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఎటొచ్చీ ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అంద‌రూ త‌న‌నే పాయింట్ అవుట్ చేయ‌డంతో మోనాల్ క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆమె బాధ చూడ‌లేక‌పోయిన అఖిల్ ఒక‌సారి అభితో మాట్లాడుకుని మ్యాట‌ర్‌ క్లియ‌ర్ చేసుకొమ్మ‌ని మోనాల్‌కు సూచించాడు. ఎన్నిసార్లు చేసుకోవాలి, నేను అలిసిపోయానంటూ మోనాల్ కంట‌త‌డి పెట్టుకోవ‌డంతో అఖిల్ బుజ్జ‌గించాడు.  పోనీ, నేను మాట్లాడ‌నా? అంటూ ఆమె అనుమ‌తి తీసుకుని అభితో చ‌ర్చించాడు. ఈ చ‌ర్చ స‌ఫ‌ల‌మ‌వుతుందా? వ‌ఇఫ‌ల‌మ‌వుతుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. (చ‌ద‌వండి: నీ వ‌ల్లే అభికి నాకు గొడ‌వ‌లు పెద్ద‌వ‌య్యాయి: మోనాల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు