బిగ్‌బాస్‌ ఫినాలే రేస్‌: అత‌డే విజేత‌!

2 Dec, 2020 15:40 IST|Sakshi

నామినేష‌న్లు అనే అడ్డంకులే లేకుండా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. అందుకే కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ప్ర‌వేశ‌పెట్టిన టికెట్ టు ఫినాలే మెడ‌ల్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు. కానీ మెడ‌ల్ సాధించాల‌ని అంద‌రికీ ఉన్నా వ‌శ‌మ‌య్యేది మాత్రం ఒక్క‌రికే. ఈ క్ర‌మంలో టికెట్ టు ఫినాలే మొద‌టి లెవ‌ల్‌లో అఖిల్‌, అభిజిత్‌, హారిక‌, సోహైల్ విజ‌యం సాధించారు. వీరి మ‌ధ్య నేడు రెండో లెవ‌ల్ పోటీ జ‌రగ‌నుంది. నిన్న పాలు పిత‌డ‌కడం అనే టాస్క్ పెట్టిన బిగ్‌బాస్ నేడు పూలు విస‌ర‌డం టాస్క్ పెట్టాడు. ఇందులో హారిక మ‌గాళ్ల‌తో ధీటుగా ఆడేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి)

కానీ సోహైల్‌ ఆమెకు పూలు అంద‌కుండా లాగి ప‌డేసిన‌ట్లు చూపించారు. దీంతో విసిగిపోయిన హారిక.. చేతుల్లోంచి లాక్కోవ‌ద్దంటారు, అక్క‌డ మ‌ట్టిలో పీకొద్దంటారు. ఇలాగైతే ఎట్లా గెలిచేది? బ‌్ల‌డీ.. అంటూ ఏడ్చేసింది. దీంతో అవినాష్ వెళ్లి ఆమె క‌న్నీళ్లు తుడిచాడు. మరోవైపు అఖిల్‌-సోహైల్ నిన్న క‌లిసి ఆడినందుకు అవినాష్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు. వాళ్లు ఒంట‌రిగా ఆడి గెల‌వ‌లేద‌న్న‌ట్లు మాట్లాడాడు. దీంతో మండిప‌డ్డ‌ సోహైల్ మేమేదో త‌ప్పు చేసిన‌ట్లుగా మాట్లాడ‌కు, మా తెలివితో ఆడాం అని వాదించినా ఆయ‌న చెవికెక్కించుకోలేదు. ఇక సోష‌ల్ మీడియాలో అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అఖిల్‌, సోహైల్ మూడో లెవ‌ల్‌కు అర్హ‌త సాధించారు. అందులో అఖిల్ మెడ‌ల్ సొంతం చేసుకుని టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. (చ‌ద‌వండి: రికార్డు సృష్టిస్తోన్న మోనాల్‌, అంతా అభి వ‌ల్లే!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు