నోయ‌ల్‌పై విరుచుకుప‌డ్డ మాస్ట‌ర్‌

22 Oct, 2020 20:30 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో తొలి వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నింటినీ దింపేశారు. మొద‌ట‌గా వ‌చ్చిన కుమార్ సాయిని ఇంటిస‌భ్యులు క‌లుపుకోలేక‌, చివ‌రికి ఏకాకిగానే వీడ్కోలు తీసుకున్నాడు. త‌ర్వాత వ‌చ్చిన అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ కొత్త ఎన‌ర్జీని నింపుతూ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ మెరుపుతీగ‌లా ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా ఉండ‌కుండా వ‌చ్చినదారినే వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన‌ప్పుడు అంద‌రిక‌న్నా ఎక్కువ బాధ‌ప‌డ్డ ఏకైక వ్య‌క్తి నోయ‌ల్‌. అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆమెను నామినేట్ చేయ‌డం వ‌ల్లే ఎలిమినేట్ అయింద‌ని నోయ‌ల్ మ‌న‌సులో ఓ అభిప్రాయం బ‌లంగా నాటుకుపోయింది.

స్వాతి ఎలిమినేష‌న్‌తో మొద‌లైన గొడ‌వ‌
దీంతో ఇదే కార‌ణాన్ని ప్ర‌స్తావిస్తూ అత‌డు మాస్ట‌ర్‌ను నామినేట్ చేశాడు. ఇది ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. అమ్మాయి కోసం త‌న‌ను నామినేట్ చేస్తావా? అని ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. నీ వ‌ల్ల నేను వెళ్లిపోతే నువ్వు జీవితాంతం బాధ‌ప‌డాలంటూ శాప‌నార్థాలు పెట్టాడు. అప్ప‌టినుంచి వీరి మ‌ధ్య దూరం పెరిగిపోయింది. అయితే ఈ దూరాన్ని త‌గ్గించుకునేందుకు మొన్న నోయ‌ల్ ముందుకు వ‌చ్చి మాస్ట‌ర్‌కు అర‌గుండు గీశాడు. అయినా స‌రే వాళ్లు తిరిగి మామూలైన‌ట్లు క‌నిపించ‌డం లేదు. నేటి ఎపిసోడ్‌లో మ‌రోసారి గొడ‌వ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: నోయ‌ల్‌కు శాపం పెట్టిన అమ్మ రాజ‌శేఖ‌ర్‌)

నోయ‌ల్‌పై విరుచుకుప‌డ్డ మాస్ట‌ర్‌
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం.. "నా దృష్టిలో ప్రామిస్ పెద్ద విష‌యం.. అది ఇప్పుడు కాక‌పోతే  నేను చ‌నిపోయాకైనా మీకు అర్థ‌మ‌వుతుంది" అని నోయ‌ల్ చెప్తుంటే మ‌రి నా ప్రామిస్ మిస్ చేశావ్ క‌దా! అని మాస్ట‌ర్ ఎదురు తిరిగాడు. నేను మాటిస్తే మనిల‌బ‌డ‌తాన‌ని రాసిస్తాన‌ని నోయ‌ల్ అంటుంటే మాస్ట‌ర్ మ‌ళ్లీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగాడు. 'కెమెరా కోసం డ్రామాలు.. ప్రామిస్ మీద నిల‌బ‌డే క్యారెక్ట‌ర్ నీకు లేదు. బ‌య‌ట‌కు వెళ్లినా కూడా ఎన్ని అనాలో అన్ని అంటాను' అని విరుచుకుప‌డ్డాడు. ఈ గొడ‌వ‌తో అక్క‌డున్న వాళ్లంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. ఇక గొడ‌వ జ‌రిగినందుకు అభికి హ్యాపీ అని నోయ‌ల్ అన్నాడు. అంటే అభిజిత్ నోయ‌ల్ ద‌గ్గ‌ర‌ మాస్ట‌ర్ ప్ర‌స్తావ‌న తీసుకుచ్చాడా? ఈ క్ర‌మంలోనే వారికి వాగ్వాదం జ‌రిగిందా? అనేది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. (చ‌ద‌వండి: మాస్ట‌ర్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌)

మరిన్ని వార్తలు