బిగ్‌బాస్‌: నామినేష‌న్‌లో మాస్ట‌ర్‌, మెహ‌బూబ్‌!

26 Oct, 2020 15:49 IST|Sakshi

త‌న‌ను సేవ్ చేసిన అరియానాను నామినేట్ చేసిన మెహ‌బూబ్‌

మోనాల్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేశారు

స‌మంత వ‌చ్చిన వేళావిశేషం.. ఎలిమినేష‌న్ ఉండ‌దేమో అని కంటెస్టెంట్లు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ వారి ఆశ‌ల‌ను నీరుగారుస్తూ దివి ఎలిమినేట్ అని హీరోయిన్‌ స‌మంత‌ బాంబు పేల్చింది. అయితే అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో సాన్నిహిత్యం కూడా దివి వెళ్లిపోవ‌డానికి ఓ కార‌ణ‌మే అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా వుంటే ఎనిమిదోవారానికిగానూ నేడు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో మెహ‌బూబ్ అరియానాను నామినేట్ చేశాడు. మ‌నిద్ద‌రి మ‌ధ్య అన్ని స‌మ‌స్య‌లు తొలిగిపోవాల‌ని నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ కార‌ణం విన్న అరియానాకు కోపం నషాళానికి తాకింది. క్లియ‌ర్ అవ్వాల‌ని చెప్పి నామినేట్ చేసి బ‌య‌ట‌కు పంపించేస్తున్నావేంట‌ని మండిప‌డింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్‌పై అభి, అఖిల్ సెటైర్లు)

ఎవ‌రికి లేరు అమ్మానాన్న?: అమ్మ రాజ‌శేఖ‌ర్
ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్ అఖిల్‌, అభిజిత్‌, మోనాల్ గొడ‌వ‌ను ఎత్తి చూపాడు. దీంతో సీరియ‌స్ అయిన అఖిల్‌.. అభిజిత్‌తో మోనాల్ మాట్లాడ‌క‌పోవ‌డం త‌నిష్టం. నేనేమీ త‌న‌ను ఆప‌లేదు అని క్లారిటీ ఇచ్చాడు. నేను అన్న మాట‌కు బ‌య‌ట మా అమ్మానాన్న కూడా హ‌ర్ట్ అయి ఉండ‌వ‌చ్చ‌ని అఖిల్‌ చెప్తూ ఉండ‌గా మాస్ట‌ర్ మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకుని ఎవ‌రికి అమ్మానాన్న లేరు? అంటూ ఆవేశంతో విరుచుకుప‌డ్డారు. నువ్వు పెద్ద నేరం చేశావంటూ అభిజిత్ తొలిసారి మోనాల్‌ను నామినేట్ చేశాడు. మొత్తంగా మోనాల్‌, మెహ‌బూబ్‌, అఖిల్‌, లాస్య‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా గ్లోరీ ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఉన్న‌ట్లు లీకువీరులు చెప్తున్నారు. (చ‌ద‌వండి: కెప్టెన్ అయ్యాడో లేదో కొత్త రూల్స్ పెట్టేశాడు)

మోనాల్‌ను మెంట‌ల్ టార్చ‌ర్ చేస్తున్నారు
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు మోనాల్‌పై సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. నామినేష‌న్ ప్ర‌క్రియ వ‌చ్చిన ప్ర‌తిసారి టాస్కుల్లో ప‌ర్ఫామెన్స్‌కు బ‌దులు ఆమె క్యారెక్ట‌ర్‌ను నిందిస్తూ మాన‌సికంగా టార్చ‌ర్ చేస్తున్నారని ఆమె అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త‌వారం మెహ‌బూబ్ కోసం నామినేష‌న్‌లోకి వెళ్లిన అరియానాను మెహ‌బూబ్ నామినేట్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్ వేరొక‌రి విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డాన్ని కూడా విమ‌ర్శిస్తున్నారు. ఏదైతేనేం.. మాస్ట‌ర్ నామినేష‌న్‌లోకి వ‌స్తే పంపించేయ‌డం కోసం ఎంతోమంది నెటిజ‌న్లు కాచుకుని కూచున్నారు. ఈ లెక్క‌న ఈ వారం మాస్ట‌ర్ బ్యాగు స‌ర్దుకుని ఇంటి బాట ప‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. (చ‌ద‌వండి: దివి ఎలిమినేట్‌, లాస్య‌పై బిగ్‌బాంబ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు