ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌లోకి వెళ్లను : యాంకర్‌

27 Nov, 2020 17:43 IST|Sakshi

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్‌బాస్‌ షోపై ప్రముఖ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాల్లో సీజన్‌లో విష్ణుప్రియ పాల్టొంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌లో విష్షుప్రియ మాట్లాడుతూ..  తనకు బిగ్ బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా బిగ్ బాస్ వెళ్లనని తేల్చి చెప్పింది.

‘బిగ్ బాస్ కన్సెప్టే నాకు నచ్చదు. ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు.. ఎలిమినేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా? లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. మీ ఇళ్లు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా.. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాదు.. చిన్నప్పటి నుంచి కూడా నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇలాంటి షోని నేను ఎంకరేజ్ చేయను.

నేను ఎప్పుడూ చేసే పని ద్వారా నా స్టాటస్ పెరగాలని అనుకోను. పది మంది గుర్తించాలని కూడా అనుకోను. నేను చేసిన పనిని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసిన తరువాతే అవతలి వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నా గోల్ ఏంటంటే.. నేను నవ్వుతూ ఉండాలి.. నా చుట్టుపక్కల వాళ్లు కూడా నవ్వుతూ ఉండాలి. అది ఎలా అయినా సరే.. టీవీ కావచ్చు.. సినిమా కావచ్చు. నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలి. పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అయితే లేదు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోకి అయితే వెళ్లడం జరగదు. రాసిపెట్టుకోండి. వెళ్తే నన్ను బ్లేమ్ చేసుకోవచ్చు’ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఆమెను బ్లేమ్‌ చేసే సమయం వస్తుందో రాదో చూడాలి మరి. కాగా,  ‘పోవే పోరా' షోతో ఫేమస్‌ అయిన విష్షుప్రియ.. ప్రస్తుతం వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతుంది. ఇటీవల ఆమె 'చెక్‌మేట్' అనే సినిమాలో అందరాలు ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఆ ఇద్దరికే నా సపోర్ట్‌.. నాగబాబు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా