బిగ్‌బాస్‌: అనుష్క అందుకే రాలేద‌ట‌!

29 Sep, 2020 16:45 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఓ ప్ర‌త్యేక‌మైన అతిథి రానుందంటూ ఇటీవ‌ల బోలెడు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. మొన్న‌టి ఆదివారం ఎపిసోడ్‌లో అగ్ర తార‌‌‌ అనుష్క అతిథిగా రానుంద‌ని కొంద‌రు, లేదు,లేదు.. హోస్ట్‌గా క‌నిపించ‌నుంద‌ని మ‌రికొంద‌రు ఆమె అభిమానులను తెగ ఊరించారు. చివరాఖ‌రికి స్వీటీ స్టేజీపై ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో నిరుత్సాహ‌ప‌డ్డారు. బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే రెండో మ‌హిళా వ్యాఖ్యాత‌గా నిలిచిపోతుంద‌ని క‌న్న క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయేన‌ని బాధ‌ప‌డ్డారు. అయితే తాను ఎందుకు రాలేద‌న్న విష‌యం స్వీటీ క్లారిటీ ఇచ్చేశారు. ఇది క‌రోనా కాలం, ఏమాత్రం అజాగ్ర‌త్త వ‌హించినా ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంత మంచిది కాదు కనుక సినిమా ప్ర‌మోష‌న్స్ చేసేందుకు అనుష్క‌ నిరాక‌రించారు. (చ‌ద‌వండి: నిశ్శబ్దం ఫ్రెష్‌ ఫీల్‌ ఇస్తుంది)

అస‌లే ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమా, దీనికి త‌గిన ప్ర‌చారం చేయ‌క‌పోతే క‌ష్ట‌మ‌ని చిత్ర‌యూనిట్ అభ్య‌ర్థించ‌డంతో ఎట్ట‌కేల‌కు ఆమె ప్ర‌మోష‌న్స్‌కు‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. కానీ ఓ కండీష‌న్ పెట్టారు. కేవ‌లం ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్స్ మాత్ర‌మే చేస్తాన‌ని తెలిపారు. బ‌య‌ట‌కు వెళ్లి, టీవీ ఛాన‌ల్స్‌లో పాల్గొన‌డం వంటివి చేయ‌న‌ని తేల్చి చెప్పారు. దీంతో ఈ కార‌ణంగానే బిగ్‌బాస్ షోకు వెళ్లేందుకు సైతం నిరాక‌రించిన‌ట్లు పేర్కొన్నారు. కాగా అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'నిశ్శ‌బ్ధం' సినిమాలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, మైఖేల్ మ్యాడ్‌స‌న్‌, షాలినీ పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని కేవ‌లం 55 రోజుల్లో తీయ‌గ‌లగ‌డం విశేషం. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మెహ‌బూబ్ సేఫ్‌‌, దేవి అవుట్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు