బిగ్‌బాస్‌: ఎనిమిదో కెప్టెన్‌గా అరియానా!

29 Oct, 2020 16:13 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ డే కేర్ అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ విజ‌య‌వంతంగా ముగిసింది. అంద‌రి ద‌గ్గ‌రా చాక్లెట్లు కొట్టేసి అల్ల‌రి చేసిన హారిక క‌ష్టం వృథా అయింది. హౌస్ టాపు లేచిపోయేలా అల్ల‌రి చేసిన అరియానా జోడీ విజేత‌గా నిలిచింది. దీంతో వారికి స్పెష‌ల్‌గా చాక్లెట్లు, ఇష్ట‌మైన ఫుడ్‌ను బిగ్‌బాస్ అందించాడు. నేడు కెప్టెన్సీ పోటీ జ‌ర‌గ‌నుంది. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కృత్రిమ ఆపిల్ పండ్ల చెట్టును పెట్టారు. దానిపై ఉన్న ఆపిల్ పండ్ల‌కు ఇంటిస‌భ్యుల ఫొటోల‌ను పెట్టారు. చూస్తుంటే ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న‌ట్లు క‌నిపిస్తున్న ఈ టాస్క్‌లో ఇంటిస‌భ్యుల మ‌ధ్య బేధాభిప్రాయాలు తొంగి చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక మోనాల్.. హారిక ఫొటో ఉన్న యాపిల్ పండును చిదిమేసింది. (త‌న గేమ్ ప్లాన్ రివీల్ చేసిన అభిజిత్‌)

కెప్టెన్సీ ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేయాల‌నుకున్న అరియానా బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో కెప్టెన్‌గా అవ‌త‌రించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. కాగా గ‌త‌వారం అవినాష్‌, అరియానా కెప్టెన్సీ పోటీలో త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. కెప్టెన్ అయ్యేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కు తీవ్రంగా శ్ర‌మించినప్ప‌టికీ అరియానా త‌ను అనుకున్న ల‌క్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో అవినాస్ కెప్టెన్‌గా అవ‌త‌రించాడు, త‌న మార్క్ చూపించేలా ఇంట్లో కొత్త రూల్స్ కూడా ప్ర‌వేశ‌ పెట్టాడు.  మ‌రోవైపు పొర‌పాటున తాను కెప్టెన్ అయితే చుక్క‌లు చూపిస్తానన్న అరియానా ఎట్ట‌కేల‌కు త‌న కోరిక నెర‌వేర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి కెప్టెన్‌గా అరియానా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి. (టాస్క్‌‌ మ‌ధ్య‌లో ‌ప‌డిపోయిన అవినాష్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు