అవునా.. అరియానాకు బిగ్‌బాస్‌ అంత ఇస్తున్నాడా?

4 Oct, 2020 20:36 IST|Sakshi

అరియానా గ్లోరి.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4 షోలో గ్లామర్‌తో పాటు తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకొంటున్న ఎకైక బ్యూటీ. తను మాట్లాడే తీరు చిన్న పిల్లలా అనిపించినప్పటికీ.. ఆ మాటల్లో నిజం, నిజాయతీ కన్పిస్తుంది. తనకు అనిపించిన విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇక గేమ్‌ పట్ల తనకు ఉన్న శ్రద్ధ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో బెస్ట్‌ ఫర్మార్మెన్స్ ఇచ్చేందుకు ట్రై  చేస్తుంది. అవసరమైతే తోటి కంటెస్టెంట్స్‌తో గొడవకు కూడా వెనుకాడదు. ఇక అరియానా ధరించే దుస్తులు, కనిపించే విధానం మిగిలిన కంటెస్టెంట్స్‌ కంటే ఢిఫరెంట్‌గా ఉంటుంది. మొత్తానికి ఏదో రకంగా బిగ్‌ బాస్‌ కెమెరా ముందు ఎక్కువ టైం కనిపించేలా మాయ చేస్తుంది.
(చదవండి : బిట్టూ.. సుజాత‌ను ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు)

 వార వారానికి తన రేంజ్‌ను పెంచుకొంటూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారింది. బిగ్‌ బాస్ హౌస్‌లో అరియానా వేస్తున్న అడుగులు, రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు బిగ్‌బాస్ షో అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నది. ఇక బిగ్‌బాస్‌లో అరియానా గ్లోరి పాల్గొనందుకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్నందుకు అరియానా పెద్ద మొత్తంలోనే తీసుకుందట. బిగ్‌ బాస్‌ సీజన్ 4లో పాల్గొన్నందుకు అరియానాకు వారానికి చొప్పున పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. వారానికి లక్షకుపైగానే రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోలిస్తే ఇది కాస్త తక్కువైనప్పటీ.. బిగ్‌బాస్‌ హౌస్‌ తన కెరీర్‌కి మంచి వేదికైంది అనడంలో సందేహం లేదు. (చదవండి : బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు